ఆమ్నీషియా పబ్ రేప్ కేసు.. రేప్ చెయ్యటానికి నిందితులకు ప్రేరణ ఏమిటో తెలుసా?
జూబ్లీహిల్స్ లోని ఆమ్నీషియా పబ్ మైనర్ బాలిక సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై నిందితులను సంఘటన స్థలానికి తీసుకువెళ్లి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు నిందితుల నుండి అనేక కీలక విషయాలను రాబట్టారు. విచారణ లో నిందితులు చెప్పిన విషయాలు పోలీసులను షాక్ కు గురి చేశాయి.

మైనర్ బాలిక అత్యాచారం కేసు.. జరిగింది చెప్పిన నిందితులు
నిందితులు అత్యాచారం చెయ్యాలన్న ఇంటెన్షన్ తోనే పబ్ కి వెళ్లారని, పబ్ కి వెళ్లక ముందే కండోమ్ ప్యాకెట్ లను కొనుగోలు చేశారని, వాటిని కార్లో పెట్టుకున్నారని ఇప్పటికే ఒప్పుకున్నారు. అంతేకాదు ఈ కేసులో మరిన్ని ఆసక్తికరమైన విషయాలను నిందితులు వెల్లడించినట్లు తెలుస్తోంది. పరీక్షలు పూర్తయిన అప్పటినుంచి అందరం ఖాళీగా ఉన్నామని, అందుకే ప్రతిరోజు పబ్ కు వెళ్తున్నామని పేర్కొన్న నిందితులు, అక్కడ ఇద్దరు బాలికలను పరిచయం చేసుకున్నామని వెల్లడించారు. అయితే వారితో డేటింగ్ కి వెళదామని అడగాలని అనుకున్నాము కానీ, వాళ్ళ అమాయకంగా కనిపించడంతో ఏదో ఒకటి చెప్పి నమ్మించి బయటకు తీసుకువెళ్ళి ఏదో ఒకటి చెయ్యాలని భావించామని వెల్లడించారు.

ఇంగ్లిష్ సినిమాలు, వెబ్ సీరీస్ లు తమకు ప్రేరణ
ఇక వారి ప్రతిస్పందన కనిపెట్టడం కోసం వారితో అసభ్యంగా ప్రవర్తించామని చెప్పిన నిందితులు వాళ్లు బయటకు రావడంతో తాము కూడా బయటకు వచ్చి, వారిలో ఒక బాలికను నమ్మించి, తమతోపాటు తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు వెల్లడించారు. అయితే పోలీసుల విచారణలో ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్ లు తమకు ప్రేరణ ఇచ్చాయని బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులు విచారణలో పోలీసు అధికారులతో చెప్పినట్టు సమాచారం. అశ్లీల చిత్రాలు, వెబ్ సీరీస్ లు తమను అత్యాచారానికి పురికొల్పాయని తెలిపారని తెలుస్తుంది.

అత్యాచార ఘటనలో ఉన్న మైనర్ల విచారణ
అయితే ఈ అత్యాచార ఘటనపై మరిన్ని సాక్ష్యాధారాలను సేకరించేందుకు ప్రయత్నంలో ఉన్న పోలీసులు, అత్యాచార ఘటనలో పాల్గొన్న మైనర్ లను కూడా విచారిస్తున్నారు. ఇక మైనర్ లలో ఒకరు నోరు విప్పక పోగా, మరో ఇద్దరు మాత్రం వివరాలు వెల్లడిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కేసులో మైనర్ లను పబ్ కు తీసుకు వెళ్ళిన వాళ్ళు ఎవరు? అసలీ మైనర్లు ఏమేమి చేస్తున్నారు? వీరు చదువుతున్న కళాశాలల వివరాలు ఏంటి? ఇంకేమైనా దుర్వ్యసనాలకు వీరు అలవాటు పడ్డారా? వంటి అనేక వివరాలను పోలీసులు సేకరించే పనిలో పడ్డారు.

మైనర్ ల విచారణ .. కీలక విషయాలు వెలుగులోకి
ఇదిలా ఉంటే కోర్టు ఆదేశాలతో ముగ్గురు మైనర్లకు ఐదు రోజులు కస్టడీ కొనసాగుతుంది. మరో ఇద్దరు మైనర్లకు నాలుగు రోజుల కస్టడీ మంగళవారంతో ముగియనుంది. ఇక సోమవారం కస్టడీ ముగియడంతో ఈ కేసులో కీలకంగా ఉన్న సాదుద్దీన్ ను కోర్టులో హాజరు పరచి చంచల్గూడా జైలుకు తరలించారు. ఇక మైనర్లను విచారిస్తున్న క్రమంలో మరెన్ని కీలక విషయాలు బయటకు వస్తాయో తెలియాల్సి ఉంది.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications