ఆమ్నీషియా పబ్ బాలిక రేప్ కేసు: మహిళలు తలుచుకుంటే నిందితులను శిక్షించలేమా: సీతక్క!!
ఆమ్నీషియా పబ్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటన తెలంగాణ రాష్ట్రంలో దుమారంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడిన వారిలో అధికార పార్టీకి, అధికార పార్టీకి మిత్రపక్షంగా ఉన్న పార్టీకి సంబంధించిన నేతల కుమారులు ఉన్నారని ఆరోపణలు వెల్లువగా మారాయి. అందుకే ఈ ఘటనలో పోలీసులు నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
తాజాగా బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై స్పందించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క రాష్ట్రంలో దారుణ పరిస్థితులను ప్రశ్నించారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే మీ పార్టీ మీ ఫ్రెండ్లీ పార్టీ అయినా ఎంఐఎం నాయకుల పిల్లలు ఏ తప్పు చేసినా కూడా తప్పించే ప్రయత్నం చేస్తారా అంటూ ఎమ్మెల్యే సీతక్క తీవ్రస్థాయిలో రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తే మహిళా లోకం ఊరుకోదు అని ఆమె తేల్చి చెప్పారు.
Why is CM KCR silent ??
— Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) June 4, 2022
We women will come out of kitchen to punish the actual rape culprits if you don’t punish them, When Home Minster grand son name is coming out that he is also accused how come home Minster do Justice to the rape minor victim? #HyderabadRape #MinorRape pic.twitter.com/03oy7K5A7z
తెలంగాణ రాష్ట్రంలో బాలికలకు రక్షణ లేకుండా పోయింది అన్న ఎమ్మెల్యే సీతక్క ఆడవారికి పౌరుషం లేదు అనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. వంటిల్లు వదిలి రోడ్ల మీదకు వస్తే మీరు శిక్షించకుండా వదిలేసిన నేరస్తులను కూడా మహిళల శిక్షిస్తారు అంటూ ఎమ్మెల్యే సీతక్క తేల్చిచెప్పారు. ఇక మహిళాలోకాన్ని ఉద్దేశించి మాట్లాడిన సీతక్క ఏం మనకు పౌరుషం లేదా అంటూ ప్రశ్నించారు. సమాజంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నా, బాలికపై అధికార పార్టీకి సంబంధించిన నాయకుల పిల్లలు సామూహిక అత్యాచారానికి పాల్పడినా వంటింటికే పరిమితం అవుదామా అంటూ ప్రశ్నించారు.

మనం వేసుకునే బట్టలపై, నగలపై, కూరగాయలపై గంటలు గంటలు చర్చలు జరిపే మనం మనకు జరుగుతున్న అన్యాయం పై గళం విప్పలేమా అంటూ సీతక్క ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిందితులను తప్పించే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నాయని సీతక్క మండిపడ్డారు. ప్రతి మహిళ బయటికొచ్చి మనకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించాల్సిన అవసరం ఉందని, నిందితులను తపిస్తున్న ప్రభుత్వ తీరుపై ధిక్కార స్వరం వినిపించాల్సిన సమయం ఆసన్నమైందని, మహిళాలోకం బయటకు రావాలని ఎమ్మెల్యే సీతక్క పిలుపునిచ్చారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications