High Court: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై హైకోర్టులో విచారణ..
కొద్ది నెలల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ప్రకటించింది. గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, సత్యనారయణ నామినేట్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ ఇద్దరి పేర్లను గవర్నర్ కు పంపారు. అయితే గవర్నర్ వీరి పేర్లను ఆమోదించలేదు. ఇంతలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.
అయితే గవర్నర్ తమ పేరును ఆమోదించకపోవడంపై దాసోజు శ్రవణ్, సత్యనారాయణ రాష్ట్ర హైకోర్టుకు వెళ్లారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టికల్ 171 ప్రకారం తమను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిందని.. దాన్ని తిరస్కరించే హక్కు గవర్నర్ లేదని వారు పేర్కొన్నారు. వీరి పిటిషిన్ పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ అడ్డుకోలేరని శ్రవణ్, సత్యనారాయణ తరుఫు న్యాయవాదులు వాదించారు.

ఆర్టికల్ 361 ప్రకారం ఈ పిటిషన్ కు అర్హత లేదని గవర్నర్ తరుపు కౌన్సిల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు పిటీషన్ మెంటేనబిలిటీ పై విచారణ చేస్తామని పేర్కొంది. తదుపరి విచారణను జనవరి 24కు వాయిదా వేసింది. శ్రవణ్, సత్యనారాయణకు ఎమ్మెల్సీ పదవులు వస్తాయా లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రభుత్వం మారడంతో వారికి ఎమ్మెల్సీ అయ్యే అవకాశం కనిపించడం లేదు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఈ రెండు ఎమ్మెల్సీలతో పాటు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ, పట్టభద్రులు ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉంది. ఇందులో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలక షెడ్యుల్ విడుదలయింది. కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో ఖాళీ అయిన రెండు స్థానాలకు జనవరి 11న నోటిఫికేషన్ రానుంది. నామినేషన్ల దాఖలకు జనవరి 18 చివరి తేదీగా ఉంది.
నామినేషన్ ఉపసమరణకు చివరి జనవరి 22 వరకు గడువు ఉంది. జనవరి 29న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నిక జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది.












Click it and Unblock the Notifications