
ఆ సంస్థలపై నమ్మకం లేదు.!సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జిచేత విచారణ జరిపించాలి.!కొనుగోలుపై రేవంత్ డిమాండ్.!
మునుగోడు/హైదరాబాద్: బీజేపీ, టీఆరెస్ పరస్పర రాజకీయ సమన్వయంతో కాంగ్రెస్ ఆనవాలు లేకుండా చేయాలనుకుంటున్నారని, అందులో భాగంగానే వ్యూహాత్మకంగా రెండు పార్టీలు వివాదం సృష్టిస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని, గతంలో దుబ్బాక ఉప ఎన్నికలో కూడా ఇలాంటి ప్రయత్నమే చేశారని అధికార టీఆర్ఎస్, బీజేపి పార్టీలపైన ఘాటు విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రశేఖర్ రావును ఓడించాలనే లక్ష్యం తో దుబ్బాకలో బీజేకి ఓటు వేశారన్న అంశాన్ని మర్చిపోకూడదని రేవంత్ రెడ్డి గుర్తు చేసారు.

ఎవ్వరెన్ని కుట్రలు చేసినా ఏమీ కాదు.. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో రేవంత్ స్పందన..
హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ కు అన్యాయం జరుగుతుందని సానుభూతి పొందారని, దీంతో కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నీ కాంగ్రెస్ సానుభూతిపరులు ఈటెలకు వేశారని రేవంత్ గుర్తు చేసారు. ఈటెల ఆక్రమించుకున్న భూములు ఏమయ్యాయి? ఆయనపై కేసులు ఏమయ్యాయి? ఆయన్ను జైలుకు పంపిస్తామన్న వారు ఏమయ్యారు? అసలు ఇప్పుడు ఆ ఎన్నికల్లో దొరికిన డబ్బులు ఏమయ్యాయో తెలియదని రేవంత్ రెడ్డి విస్మయాన్ని వ్యక్తం చేసారు. మునుగోడు ఉప ఎన్నికలోనే కాకుండా తెలంగాణలో కాంగ్రెస్ ను ఆటలోనుంచి తప్పించే విధంగా ఈ రెండు పార్టీలు వ్యవహారిస్తున్నాయని రేవంత్ మండి పడ్డారు.

కాంగ్రెస్ ను దెబ్బ కొట్టలేరు.. బీజేపి, టీఆర్ఎస్ కు రేవంత్ వార్నింగ్
ఇలాంటి
కుట్రలను
తిప్పి
కొట్టాలని
తాను
ముందే
శ్రేణులకు
పిలుపునిచ్చాన్నారు
రేవంత్
రెడ్డి.
మూడు
రోజుల
క్రితం
గులాబీ
పార్టీ
ఎమ్మెల్యే
ఫామ్
హౌస్
లో
నాటకం
పరాకాష్టకు
చేరిందని,
మునుగోడు
ఉప
ఎన్నిక,
జోడో
యాత్ర
దృష్టిని
మరల్చేందుకే
ఈ
నాటకాలు
కొనసాగుతున్నాయన్నారు
రేవంత్.
సీఎం
చంద్రశేఖర్
రావుకు,
మంత్రి
కేటీఆర్
కు
ఈ
ఫామ్
హౌస్
లు
బాగా
అచ్చొచ్చాయని
రేవంత్
రెడ్డి
ఎద్దేవా
చేసారు.
అందుకే
టీఆర్ఎస్
ఎమ్మెల్యేల
కొనుగోలు
అంశాన్ని
చర్చకు
తెచ్చారని,
ఇప్పటివరకు
విడుదలైన
ఆడియో
రికార్డుల
ప్రకారం
పైలట్
రోహిత్
రెడ్డి
వాళ్ళను
డబ్బులు
అడుగుతున్నాడని,
ఇతర
ఎమ్మెల్యేలను
కూడా
పార్టీ
మారేందుకు
ఒప్పిస్తాననే
బేరం
కుదుర్చుకున్నాడని
రేవంత్
రెడ్డి
స్పష్టం
చేసారు.

కొనుగోలు వ్యవహారంలో సీసీ కెమారాలదే కీలక పాత్ర.. ఎమ్మెల్యేల సెల్ ఫోన్లు ఎందుకు సీజ్ చేయలేదన్న ఆర్ఆర్..
అంతే కాకుండా రోహిత్ రెడ్డిని నిందితుడిగా చేర్చకుండా పీసీ యాక్ట్ ఎలా నిలబడుతుందని, ఈ మాత్రం కూడా స్టీఫెన్ రవీంద్రకు తెలియదా?అని, ఈ వ్యవహారంలో అత్యంత కీలకమైన నలుగురు ఎమ్మెల్యేల ఫోన్స్ ఎందుకు సీజ్ చేయలేదని, ఏసీబీ పూర్తిగా సీఎం చంద్రశేఖర్ రావు డైరెక్షన్ లో నడుస్తోందని ఘాటు విమర్శలు చేసారు. కొనుగోలు కేసును ఆధారాలతో నిరూపించాలన్నా ఫోన్స్, అక్కడి సీసీ కెమెరాలే కీలకమన్నారు రేవంత్ రెడ్డి. పోలీసులే ఎమ్మెల్యేలను ప్రగతి భవన్ కు తీసుకెళ్లారనొ, అప్పటి నుంచి ఆ ఎమ్మెల్యేలు కనిపించడం లేదని, వారు ఎక్కడున్నారు? వారిని ఏం చేశారని రేవంత్ రెడ్డి ప్రశ్నిచారు.

ఎమ్మెల్యేల ముఠాకు కేసీఆర్ నాయకుడు.. సీఎం మీద కేసు నమోదు చేయాలన్న పీసిసి ఛీఫ్...
ఎమ్మెల్యేల ముఠాకు నాయకుడైన చంద్రశేఖర్ రావు పర్యవేక్షణలోనే ఈ వ్యవహారమంతా జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయని, అలా అయితే చంద్రశేఖర్ రావును ఏ1గా, కేటీఆర్ ను ఏ2గా చేర్చాల్సి ఉంటుందని డిమాండ్ చేయడంతో పాటు, ఎమ్మెల్యేలను నిందితులుగా చేర్చాలని రేవంత్ స్పష్టం చేసారు.వారికి సంబంధం లేకుంటే, ఢిల్లీ పెద్దలు ఎవరో తేల్చి వారిపై కేసులు నమోదు చేయాలని అన్నారు. సంతోష్ జీ పెరు కూడా చర్చకు వస్తోందని, అసలు ఏం జరిగిందనేది ప్రజానికానికి చెప్పాల్సిన బాధ్యత విచారణ సంస్థలపై ఉందన్నారు రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేలను తీసుకెళ్లిన పోలీసుల చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుందని, ఫోన్స్ సీజ్ చేస్తే ఆ ఆడియో రికార్డులు ఎలా బయటకు వచ్చాయని రేవంత్ రెడ్డి నిలదీసారు.

32 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసారు.. ఏంజరిగిందో కేసీఆర్ చెప్పాలన్న రేవంత్ రెడ్డి..
ఆడియోల బాగోతం మొత్తం ఎడిటెడ్ వెర్షన్ అని, అసలు ఆడియోల పైన విచారణ సంస్థలు లోతైన విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని రేవంత్ డిమాండ్ చేసారు. భారత్ జోడో యాత్ర దృష్టి మరల్చేందుకే ఈ డ్రామాలని, కాంగ్రెస్ చర్చలోకి రాకుండా చేయాలనే ఈ నాటకాలని, బాధ్యత గల సీఎం, మంత్రుల, అధికారులు ఈ అంశాలపై స్పందించాలన్నారు రేవంత్. విచారణ సంస్థలపై తమకు నమ్మకం లేదని, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఈ కేసును విచారణ చేయించాలన్నారు రేవంత్ రెడ్డి. 2014 నుంచి ఇప్పటి వరకు 32 మంది ఎమ్మెల్యేలను చంద్రశేఖర్ రావు కొనుగోలు చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ పై సీఎం చంద్రశేఖర్ రావు ప్రజలకు ఏం జరిగిందో వివరించాల్సిన ఆవశ్యకతనెలకొందన్నారు రేవంత్ రెడ్డి.