Viral Video: వృద్ధురాలిపై కోతుల దాడి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
అడవుల్లో ఉండాల్సిన కోతులు ఊళ్లలోకి వస్తున్నాయి. రైతుల పంటలతో పాటు మనుషుల ప్రాణాలతో కూడా ఆడుకుంటున్నాయి. తాజాగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో కోతులు వృద్ధురాలి దాడి చేసి గాయపరిచాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోతుల దాడిలో గాయపడిన వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బుధవారం సాయంత్రం ట్యాంకు రోడ్డులో ఓ ఇంట్లోకి కోతులు వచ్చాయి.
దాడి
వాటిని తరిమేందుకుు మల్లమ్మ ప్రయత్నించింది. ఆగ్రహించిన కోతులు మల్లమ్మపై దాడి చేశాయి. ఈ సమయంలో ఆమె కేకలు వేశారు. చుట్టు పక్కల వారు వచ్చేసారికి కోతులు వెళ్లిపోయాయి. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. అయితే తమకు కోతులు ఇబ్బందిగా మారాయని సుల్తానాబాద్ వాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా కోతులను అడవికి తరిమికొట్టాలని డిమాండ్ చేశారు.

పెద్దపల్లి జిల్లాలోనే కాదు
కోతులు ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే కాదు.. నిజామాబాద్, జగిత్యాలలోని పలు గ్రామాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉంది. రైతులు మొక్కజొన్న, కూరగాయల పంటలు వేస్తే వాటిని కోతులు నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే కొండెంగలను తీసుకొచ్చి కోతులను తరుముతున్నారు.
కోతులు ఎంత పని చేశాయో చూశారా..? pic.twitter.com/MQ2UU6Hbdg
— oneindiatelugu (@oneindiatelugu) October 13, 2022












Click it and Unblock the Notifications