నకిలీ ఖాతా తెరిచి నగదు చోరీ: యువకుడి హత్య

బ్యాంక్ అధికారులు విచారణ జరిపించగా అదే బ్యాంక్‌లో క్లర్క్‌గా పనిచేసిన రామకృష్ణరాజు నకిలీ అకౌంట్‌ను సృష్టించి సౌజన్య అకౌంట్‌లోని దాదాపు 14 లక్షల రూపాయల నగదును తస్కరించినట్టు తేలింది. రామకృష్ణ రాజును విధుల నుంచి సస్పెండ్ చేసిన బ్యాంక్ మేనేజర్ గొలాని బుధవారం సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్స్‌పెక్టర్ అశోక్ తెలిపారు.
యువకుడి దారుణ హత్య
హైదరాబాదులోని హఫీజ్‌పేట ఫ్లైఓవర్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో చెట్లమాటున గుర్తుతెలియని యువకుడ్ని తలపై బండరాయితో మోది హత్య చేశారు. మృతదేహం కుళ్లిపోయి దుర్గంధం రావడంతో స్థానికులు బుధవారం మియాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. నాలుగు రోజుల క్రితం హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి ఒంటిపై ఖాకీ ఫ్యాంట్, తెల్ల రంగు చొక్కా ఉన్నాయి.
మృతుడు రైల్వేసిబ్బందా? ఆటో డ్రైవరా? మున్సిపల్ సిబ్బందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు పథకం ప్రకారం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకొచ్చి ఉంటారని,మద్యం తాగించిన అనంతరం హత్య చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం వద్ద మద్యం బాటిళ్లు ఉన్నాయని తెలిపారు. వ్యక్తిగత కక్షలా? ఆర్థిక లావాదేవీలా? మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నామని మియాపూర్ సీఐ పురుషోత్తంయాదవ్ తెలిపారు.
ఫ్లైఓవర్ సమీపంలో హత్య జరిగిందనే సమాచారంతో అనేకమంది ప్రజలు రావడంతో గంటల తరబడి ట్రాఫిక్ జాం అయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ట్రాఫిక్ సిబ్బంది, మియాపూర్ సీఐ ప్రత్యేక చర్యలు తీసుకుని ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.












Click it and Unblock the Notifications