హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఈ పార్కులో సఫారీ, ట్రెక్కింగ్ ఇంకా ఎన్నో.. వీకెండ్ లో ఫుల్ చిల్..

ఉరుకులు పరుగుల జీవితం, ఉద్యోగాలు, బిజినెస్ అంటూ పెద్దలు.. స్కూల్స్, కాలేజీలు అంటూ విద్యార్థులు ఇలా అంతా బిజీగా ఉంటారు. వీకెండ్ వచ్చిందంటే నగరంలోని ఏ సినిమాకో షాపింగ్ కో వెళ్తుంటారు. అయితే ఎప్పుడూ ఈ కాంక్రీట్ జంగిల్ మధ్యే కాకుండా అలా పచ్చని ప్రకృతి నడుమ హాయిగా కొద్దిసేపు సేద తీరాలని.. సిటీ ట్రాఫిక్ ను మర్చిపోయి ఆహ్లాదకరమైన వాతావరణంలో కాసేపు విశ్రాంతి తీసుకోవాలని ఉందా..? అయితే మీకు గుడ్ న్యూస్. నిత్యం బిజీగా ఉండే భాగ్య నగర వాసుల కోసం ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగానే ఇటీవల హైదరాబాద్ కు సమీపంలో అనంతగిరి ఎకో అర్బన్ పార్క్ ను ప్రారంభించింది.

తెలంగాణ అటవీ శాఖ భాగ్యనగరాన్ని అత్యంత సుందరంగా మార్చేందుకు అడుగులు వేస్తోంది. తెలంగాణ ఊటీగా పేరొందిన అనంతగిరి కొండల్లో పర్యటకులకు మరింత ఆహ్లాదాన్ని పంచేలా సరికొత్త హంగులతో ఎకో అర్బన్ పార్క్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అనంతగిరి అడవుల్లో నందిఘాట్ సమీపంలో సుమారు 80 హెక్టార్ల విస్తీర్ణంలో రూ. 2.50 కోట్ల అంచనా వ్యయంతో ఈ అత్యద్భుతమైన ఎకో పార్కును అటవీశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా ఈ పార్కును పర్యటకుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఇక ఈ ఎకో అర్బన్ పార్కులో టూరిస్టుల కోసం ప్రత్యేకమైన సదుపాయాలను ఏర్పాటు చేశారు. పర్యటకులను మైమరిపించేలా ఎంట్రాన్స్ గేట్లు, ట్రెక్కింగ్ పాత్ లు, సముద్ర నీటిమట్టానికి 700 మీటర్ల ఎత్తున పెద్ద వాచ్​టవర్, సావనీర్ షాపు, గ్రాస్ లాండ్ ఏరియాలో పెద్ద గజబోలు, అర్బన్ పార్కులో రెండు గజబోలు, అలాగే పార్కుకు తూర్పు వైపున మరో వాచ్ టవర్ నిర్మించారు. ఈ వాచ్ టవర్ ద్వారా అనంతగిరి ఫారెస్ట్ వ్యూ ను ఆస్వాధించొచ్చు.

Ananthagiri Eco Urban Park Luxury Forest Cottages Rugged Trekking Paths Await Every Modern Traveler

పర్యటకుల వసతి కోసం ప్రస్తుతం నాలుగు కాటేజీలను ఫారెస్ట్ కార్పొరేషన్ డెవలప్ మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సందర్శకుల సంఖ్యను బట్టి మరిన్ని కాటేజీలను నిర్మించేలా పణాళికలు రూపొందిస్తున్నారు. ఈ కాటేజీలను ఆన్ లైన్ లేదా నేరుగా బుకింగ్ చేసుకోవచ్చు. అలాగే పర్యటకుల కోసం బుష్ బ్రేక్ ఫాస్ట్, బర్డ్ వాచ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. ఇక ఎకో పార్కులో ఒకరోజు ఒక వ్యక్తికి రూ. 3,800 గా నిర్ణయించారు. ఇందులోనే బ్రేక్ ఫాస్ట్, భోజనంతో పాటు వసతి సదుపాయం కూడా కల్పిస్తారు. ఇక అలాగే ఇద్దరికి అయితే రూ. 7,600 చొప్పున ఎంట్రీ ఫీజును నిర్ణయించినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో పర్యటకుల తాకిడి పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+