Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణ మాజీ మంత్రికి అనసూయ క్షమాపణలు: ఎందుకంటే..?

హైదరాబాద్: తెలంగాణ మాజీ మంత్రి జోగు రామన్నకు ప్రముఖ టీవీ యాంకర్, సినీ నటి అనసూయ భరద్వాజ్ క్షమాపణలు చెప్పారు. సేవ్ నల్లమల ఫారెస్ట్ ప్రచారంలో భాగంగా ట్విట్టర్ వేదికగా స్పందించిన అనసూయ.. గత ప్రభుత్వంలో అటవీశాఖ మంత్రిగా ఉన్న జోగు రామన్నను ట్యాగ్ చేశారు.

అయితే, ఆమెకు ప్రస్తుత అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అని తెలియదు. దీంతో జోగు రామన్నను ట్యాగ్ చేసి.. యురేనియం తవ్వకాలను నిలిపేసి.. అడవులను కాపాడాలంటూ కోరారు. అయితే, తర్వాత తన తప్పును తెలుసుకున్న అనసూయ.. మరో ట్వీట్ చేసి సరిదిద్దుకున్నారు.

 anasuya bharadwaj apologises to telangana former minister

Recommended Video

    Anasuya Bharadwaj Fires On Netizens || ఎమోషనల్ అయిన అనసూయ

    టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న జోగు రామన్నకు క్షమాపణలు చెప్పారు. తనకు కరెంటు అఫైర్స్ మీద అంత అవగాహన లేకపోవడం వల్లే ఇలా జరిగిందని.. ప్రస్తుత అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని ట్యాగ్ చేశారు.

    కాగా, ఇప్పటికే యురేనియం తవ్వకాలను జరపవద్దని, నల్లమల అడవులను కాపాడాలంటూ సినీప్రముఖులు విస్తృతంగా సోషల్ మీడియా ద్వారా ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ నటులు విజయ్ దేవరకొండ, సమంత, వరుణ్ తేజ్ లాంటి నటులు ఇప్పటికే ఈ ప్రచారంలో పాల్గొన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+