హైదరాబాద్‌లో జగన్‌కు ఘన స్వాగతం, దాసరికి నివాళులు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి న్యూజిలాండ్ పర్యటన నుంచి శనివారం రాత్రి తిరిగి వచ్చారు. భార్య భారతి రెడ్డి, కుటుంబంతో సహా ఆయన శంషాబాద్ విమానాశ్రయంలో అడుగు పెట్టారు.

గత నెల 25వ తేదీన తన కుటుంబ సభ్యులతో కలసి న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి జగన్ కుటుంబం చేరుకోగా.. వారికి వైసిపి కార్యకర్తలు, నేతలు ఘన స్వాగతం పలికారు.

 Andhra opposition is back from the chilling tour

పార్టీ నేతలు ప్రతాప్‌ రెడ్డి, సైకం శ్రీనివాస రెడ్డి, ఏపీ రాష్ట్ర కార్యదర్శులు బసిరెడ్డి సిద్ధారెడ్డి, రామయ్య, గుడివాడ అమర్నాథ్‌ తదితరులు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి జగన్ నేరుగా ఇంటికి చేరుకున్నారు.


'లోకేష్‌కు ఏపీ బాధ్యతలు ఇచ్చి, చంద్రబాబు రాష్ట్రపతి పదవి చేపట్టాలి'

దాసరి సంస్మరణ సభకు జగన్

హైదరాబాదులోని ఇమేజ్ గార్డెన్‌లో జరిగిన దాసరి నారాయణ రావు సంస్మరణ సభకు జగన్ హాజరయ్యారు. దాసరి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే.

సభకు హాజరైన జగన్.. దాసరి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. విదేశాల్లో ఉండటంతో జగన్ ఆయనను కడసారి చూడలేకపోయారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Opposition party leader YS Jagan is back from the summer vacation. Jagan seems to have relaxed very well in the tour, he looks pretty chilled in the pictures. His wife YS Bharati has accompanied him to the tour and are spotted at the Airport while returning.
Please Wait while comments are loading...