హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విదేశీ టెక్నాలజీ, రూ.కోట్లు ఖర్చు: హైదరాబాద్‌లో చంద్రబాబు విలాసవంత భవనం ఇదే!

చంద్రబాబు ఆదివారం నాడు హైదరాబాదులోని జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 65లోని తన కొత్త ఇంటిలో అడుగు పెడుతున్నారు. ఇది అయిదంతస్తుల విలాసవంత భవనం. దాదాపు 20,000 చ.అ.లలో ఉంటుంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్‌ను అంతటినీ నవ్యాంధ్ర రాజధాని అమరావతి తరలించారు. అయితే, సమైక్య ఏపీకి తొమ్మిదేళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబుకు తన ఫ్యామిలీని మాత్రం మొత్తంగా తరలించే ఉద్దేశ్యంలేనట్లుగా ఉంది.

చంద్రబాబు ఆదివారం నాడు హైదరాబాదులోని జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 65లోని తన కొత్త ఇంటిలో అడుగు పెడుతున్నారు. ఇది అయిదంతస్తుల విలాసవంత భవనం. దాదాపు 20,000 చ.అ.లలో ఉంటుంది. భువనేశ్వరి సమక్షంలో పూర్తి వాస్తుతో నిర్మించారు. అతి ఖరీదైన ప్రాంతంలో ఉంది.

జూబ్లీహిల్స్.. అత్యంత సంపన్నులు నివసించే ప్రాంతం. ఇక్కడ చంద్రబాబు ఇంద్ర భవనాన్ని తలపించేలా బిల్డింగ్ నిర్మించారు. అమరావతిలో అధికారిక నివాసం ఏర్పాటు చేసుకున్న చంద్రబాబు హైదరాబాదులో ఈ విలాస భవనం నిర్మించారు. ఇందులోకి ఆదివారం అర్ధరాత్రి గృహ ప్రవేశం చేయనున్నారు.

20 వేల చ.అ.ల్లో విలాస భవనం

20 వేల చ.అ.ల్లో విలాస భవనం

ఈ భవనాన్ని 20వేల చ.అ.లలో విలాసవంతమైన నిర్మాణ సామాగ్రితో నిర్మించారు. విదేశీ నిపుణుల సూచనల మేరకు అత్యంత విశాలమైన పడక, విశ్రాంతి గదులు నిర్మించారని తెలుస్తోంది. లాన్‌లను ప్రత్యేకంగా రూపుదిద్దారు. పునాదులు మొదలుకొని టెర్రస్ వరకు దాదాపు అన్నీ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారట.

విదేశాల నుంచి..

విదేశాల నుంచి..

యూరప్ దేశాల నుంచి తీసుకు వచ్చిన ఖరీదైన కళాఖండాలు, షాండ్లీయర్‌లు ఉన్నాయని తెలుస్తోంది. విదేశాల నుంచి తీసుకు వచ్చిన అరుదైన జాతి మొక్కలు లాన్‌లో ఉన్నాయి. ఈ ప్యాలెస్‌లో ఉపయోగించిన ఇంటీరియర్ కోసం ఇటలీ పర్యటన కూడా చేశారట. స్టిల్ట్ ఫ్లోర్‌లో 19 కార్లను పార్క్ చేయవచ్చు.

అత్యాధునిక లిఫ్టులు ఏర్పాటు చేశారు. వీఐపీ లాంజ్‌లు, డైనింగ్ హాళ్లు, స్టడీ, లైబ్రరీ, పడక గదుల కోసం ప్రత్యేక సామాగ్రిని ఉపయోగించారు. మంచి మంచి డిజైన్లను ఉపయోగించారు.

పాత భవనం స్థానంలోనే..

పాత భవనం స్థానంలోనే..

తన పాత భవనాన్ని కూల్చి వేసి అదే స్థలంలో దీనిని నిర్మించారు. ఆ పాత భవనంలో 30 ఏళ్లు నివసించారు. తొలు ఈ భవంతి స్కేర్స్ ఉంది. ఆ తర్వాత పక్క వాళ్లది కొనుగోలుచేయడంతో అది 1,285 అయింది.

రూ.10 కోట్లు ఖర్చు!

రూ.10 కోట్లు ఖర్చు!

ఈ భవనం నిర్మాణానికి రూ.10 కోట్లు ఖర్చు అయినట్లుగా తెలుస్తోంది. ఇందు కోసం చంద్రబాబు, నారా లోకేష్‌లు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.7 కోట్లు లోన్ తీసుకున్నారు.

తొలుత వివాదం

తొలుత వివాదం

ఈ ఇంటి నిర్మాణ వ్యవహారం వివాదాలతోనే మొదలైంది. నిబంధనలకు విరుద్ధంగా 13 మీటర్ ఎత్తుతో నిర్మించిన డిజైన్లను జిహెచ్ఎంసీకి ఇచ్చారు. జూబ్లీహిల్స్‌లో అమలులో ఉన్న నిబంధనల మేరకు 10 మీటర్లకు మించి ఎత్తయిన భవనాలకు అనుమతి లేదు.

దీంతో 2015 జూన్ 16న చంద్రబాబు ఇంటి నిర్మాణ ప్లాన్‌కు తిరస్కరించింది. తిరిగి 9.95 మీటర్ల ఎత్తు, సెట్ బ్యాకులతో రూపొందించిన ప్లాన్‌ను సమర్పించడంతో అదే ఏడాది ఆగస్టు 17న నిర్మాణ అనుమతులు వచ్చాయి. భవనం పూర్తయ్యాక నివాస యోగ్యమని ధ్రువీకరిస్తూ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ)ను జీహెచ్ఎంసీ నుంచి పొందాలి.

English summary
CM Chandrababu Naidu moved his entire administration to Andhra Pradesh’s new capital Amaravati. But he is not keen to shift his family from Hyderabad which he had nurtured for nine years during his earlier stint as chief minister of combined Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X