హైదరాబాద్‌లో మరో గ్యాంగ్ రేప్... బాలికపై ఆటో డ్రైవర్ల అఘాయిత్యం...?
హైదరాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. గాంధీ ఆస్పత్రి గ్యాంగ్ రేప్ ఘటనపై ఓవైపు విచారణ జరుగుతుండగానే నగరంలో మరో గ్యాంగ్ రేప్ ఘటన కలకలం రేపుతోంది. సంతోష్ నగర్ పరిధిలో కొంతమంది ఆటోడ్రైవర్లు తనను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని తాజాగా ఓ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
సంతోష్ నగర్‌లో తనను కిడ్నాప్ చేసి పహాడీ షరీఫ్ ప్రాంతానికి తీసుకెళ్లారని... అక్కడే తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. నిందితులను పట్టుకునేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే ప్రత్యేక పోలీస్ టీమ్‌లను కూడా రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి గ్యాంగ్ రేప్ ఘటన మరవకముందే నగరంలో మరో గ్యాంగ్ రేప్ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. గాంధీ ఆస్ప్రత్రి గ్యాంగ్ రేప్ ఘటనపై చిలకలగూడ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ ఘటనలో అదృశ్యమైన మహిళ ఆచూకీ ఇంతవరకూ తెలియరాలేదు. గాంధీ ఆస్పత్రిలోని మొత్తం 189 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించినా ఎక్కడా అక్కాచెల్లెళ్ల జాడ లేదు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుకు, ఆస్పత్రిలోని పరిస్థితులకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. దీంతో గాంధీలో గ్యాంగ్ రేప్ వ్యవహారం మిస్టరీగా మారింది.
అదృశ్యమైన బాధితురాలి సోదరి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. ఇద్దరు మహిళలకు కల్లు తాగే అలవాటు ఉన్నందున సమీపంలోని కల్లు దుకాణాల పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. గాంధీ ఆస్పత్రి నుంచి బాధిత మహిళ సోదరి బయటకు వెళ్లే సీసీటీవీ దృశ్యాలను సేకరించారు. అయితే ఆమె ఎక్కడికి వెళ్లిందనే దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.
ఈ ఘటనపై సమీక్ష నిర్వహించిన హోంమంత్రి మహమూద్ అలీ విచారణను మరింత వేగవంతం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కమిషనర్ అంజనీకుమార్‌ను ఆదేశించిన సంగతి తెలిసిందే. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు షబానా అఫ్రోజ్‌తో కలిసి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతారెడ్డి సోమవారం(ఆగస్టు 16) గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా బాధితురాలిని గుర్తించిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను కలిసి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా షబానా మాట్లాడుతూ.. విచారణ వేగంగా జరుగుతోందని, వాస్తవాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని అన్నారు. నిందితులను ఉపేక్షించబోమని, వారికి కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు.మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కూడా ఆస్పత్రిని సందర్శించారు. నిందితులకు త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications