హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ సంస్థ: వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఒప్పందం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక వేదిక(వరల్డ్ ఎకనామిక్ ఫోరం) వార్షిక సదస్సు తొలిరోజే తెలంగాణకు మంచి విజయం లభించింది. ఇప్పటికే పలు ప్రముఖ అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా మారిన హైదరాబాద్ నగరానికి మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థ వచ్చేందుకు మార్గం సుగమమైంది.

సీ ఫర్ ఐఆర్(సీ4ఐఆర్) సంస్థ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. స్విట్జర్లాండ్ దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశంలో ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో సేవలు అందిస్తోన్న ఈ సంస్థ.. ఇప్పటికే అమెరికా, బ్రిటన్ దేశాల్లో విస్తరించింది. తాజాగా, భారతదేశంలో ప్రవేశిస్తున్న ఈ సంస్థ తొలిసారిగా హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది.

another prestigious international company for telangana: C4IR to be established in Hyderabad

వరల్ ఎకనామిక్ ఫోరమ్ ఎండీ జెరేమీ జర్గన్స్, తెలంగాణ లైఫ్ సెన్సెస్ ఫౌండేషన్ సీఈవో శక్తి నాగప్పన్‌లు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు.

హెల్త్‌కేర్‌, లైఫ్‌ సెన్సెస్‌పై దృష్టి సారించిన సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ (సీఫర్ఐఆర్)ని స్థాపించడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ హైదరాబాద్‌ను తన భారతదేశ హబ్‌గా ఎంచుకున్నందుకు సంతోషం ఉందన్నారు. హైదరాబాద్‌లో సీఫర్ఐఆర్‌ సంస్థ ఏర్పాటుతో తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగానికి ప్రస్తుతం ఉన్న పర్యావరణ వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వ సమర్థతను ప్రతిబింబిస్తుందని మంత్రి అన్నారు.

తెలంగాణలో లైఫ్ సైన్స్ ప్రాధాన్యత రంగాల్లో ఒకటని, హైదరాబాద్‌లో సీఐర్ ఐఆర్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలనే నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం సృష్టించిన విలువ. ప్రభావాన్ని మరింత వేగవంతం చేయడానికి ప్రస్తుత పర్యావరణ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని కేటీఆర్‌ అన్నారు. కాగా, ఈ సంస్థ హైదరాబాద్ రావడంతో వందలాది ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.

English summary
another prestigious international company for telangana: C4IR to be established in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X