పుష్ప 2 టీమ్ కు మరో షాక్- లాభాల్లో వాటా కోసం హైకోర్టులో పిల్ ..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప2 సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా వివాదాలు మాత్రం వీడటం లేదు. ఈ సినిమా బెనిఫిట్ షో చూసేందుకు వెళ్లి అల్లు అర్జున్ .. అక్కడ ఓ మహిళ చావుకు కారణమయ్యారన్న ఆరోపణలు చాలా కాలం వెంటాడాయి. ఈ వివాదం సద్దుమణిగిందని భావిస్తున్న తరుణంలో ఇప్పుడు హైకోర్టులో పుష్ప2 టీమ్ పై మరో పిల్ దాఖలైంది. దీంతో పుష్ప2 సినిమా నిర్మాతలకు గట్టి షాక్ తగిలింది.
పుష్ప2 సినిమా భారీగా లాభాలు ఆర్జించిందని, ఈ విషయం ఆ సినిమా నిర్మాతలు ఇప్పటికే అంగీకరించారని, అందులో జానపద కళాకారులకు పెన్షన్ కోసం వాటా ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. ఈ మేరకు లాయర్ నరసింహారావు ఈ పిల్ దాఖలు చేశారు. ఇందుకు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పును ఆధారంగా చూపారు. అంతే కాదు పుష్ప 2 సినిమా హిట్ కు తెలంగాణ ప్రభుత్వం అందించిన సహకారం కూడా ఇందులో గుర్తుచేశారు.

తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలతో పాటు రేట్ల పెంపుకు అవకాశం ఇవ్వడం వల్లే పుష్ప2 చిత్రం భారీ లాభాలు సాధించిందని పిటిషనర్ పిల్ లో తెలిపారు. ప్రభుత్వ సహకారం తీసుకుని లాభాలు అర్జించారు కాబట్టి సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం జానపద కళాకారుల పింఛన్ కోసం ఈ డబ్బుల్లో వాటా ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఇలా వాటా పొందే హక్కు సదరు కళాకారులకు ఉందన్నారు. పూర్తి వివరాలు కోరితే ఎంత మేరకు వాటా ఇవ్వాలో తెలుస్తుందన్నారు. దీంతో హైకోర్టు ఈ కేసుపై విచారణ జరిపితే పుష్ప2 చిత్ర నిర్మాతలు ఇప్పుడు తమకు వచ్చిన లాభాల్ని బయటపెట్టాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications