ఆదిభట్ల కిడ్నాప్ కేసులో మరో ట్విస్ట్ ..నవీన్‌రెడ్డి కలిసి తిరిగిన వైశాలి వీడియో వైరల్

ఆదిభట్ల కిడ్నాపింగ్ కేసు రోజుకో కీలక మలుపు తిరుగుతుంది. ఈ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైన మిస్టర్ టి ఓనర్ నవీన్ రెడ్డి పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. పోలీసులు అతన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా మెజిస్ట్రేట్ అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఇక ఈ కేసులో ఇంతకుముందు తాను తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టు, బాధపడుతున్నట్టు నవీన్ రెడ్డి పేరుతో విడుదలైన వీడియో విషయంలో అతను సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని గంట నిడివితో ఉన్న వీడియోని రిలీజ్ చేస్తే, తప్పు ఒప్పుకున్నట్టు ఒక నిమిషం వీడియో ఎడిట్ చేసి పెట్టారని అతను ఆరోపించారు.

 వైశాలితో నవీన్ రెడ్డి పరిచయం ఇలా

వైశాలితో నవీన్ రెడ్డి పరిచయం ఇలా


ఇక తాజాగా నవీన్ రెడ్డి గంట నిడివితో చేసిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కాగా, దాంతోపాటు వైశాలి తో కలిసి తిరుగుతున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోలో నవీన్ రెడ్డి వైశాలి తో తన పరిచయం గురించి, వైశాలి తనతో కలిసి తిరిగిన విషయాలను గురించి వెల్లడించారు. నవీన్ రెడ్డి చెప్పిన కథనం ప్రకారం తాను తన ఫ్రెండ్స్ బ్యాట్మింటన్ కోర్టు కు వెళుతున్న క్రమంలో, అక్కడికి వైశాలి తన స్నేహితులతో కలిసి వచ్చేదని, అలా బ్యాడ్మింటన్ ఆడుతున్న క్రమంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది అని, కొంతకాలం తర్వాత వైశాలి తో తానే డైరెక్ట్ గా పెళ్లి ప్రపోజల్ పెట్టానని నవీన్ రెడ్డి చెప్పారు.

 నవీన్ రెడ్డి వైశాలిల పెళ్ళికి వైశాలి పేరెంట్స్ ఏమన్నారు?

నవీన్ రెడ్డి వైశాలిల పెళ్ళికి వైశాలి పేరెంట్స్ ఏమన్నారు?


అయితే అందుకు అంగీకరించిన వైశాలి తన పేరెంట్స్ ను ఒప్పించాలని, అరేంజ్డ్ మ్యారేజ్ లాగా ఉండాలని, తన పేరెంట్స్ తో ఒప్పించేలా మాట్లాడాలని నవీన్ రెడ్డి కి చెప్పిందని పేర్కొన్నాడు. ఇక ఆ తర్వాత నవీన్ రెడ్డి వైశాలి వాళ్ల నాన్నతో కూడా క్లోజ్ గా ఉండేవాడిని అని, తన మిస్టర్ టి ఫ్రాంఛైజీల ఓపెనింగులకు కూడా వైశాలి తండ్రి వచ్చేవారిని, ఆయనతో కూడా పెళ్లి ప్రపోజల్ పెడితే ఒప్పుకున్నారని తెలిపారు. వైశాలి చదువు పూర్తయిన తర్వాత గ్రాండ్ గా పెళ్లి చేద్దామని వారు చెప్పారన్నారు. అంతగా ఎక్కువ కాలం ఉండలేము అనుకుంటే ఏదైనా గుళ్లో పెళ్లి చేసుకోమని వాళ్ళే చెప్పారని, దీంతో గుళ్లో పెళ్లి చేసుకున్నామని నవీన్ రెడ్డి పేర్కొన్నారు.

 టెంపుల్ లో పెళ్ళికి ముందే ఏం చేశారో చెప్పిన నవీన్ రెడ్డి

టెంపుల్ లో పెళ్ళికి ముందే ఏం చేశారో చెప్పిన నవీన్ రెడ్డి


టెంపుల్ లో పెళ్లి చేసుకోక ముందే వైశాలి తను కలిసి బయట బాగా తిరిగే వాళ్లని, తానే తన కారులో కాలేజీ కి తీసుకెళ్ళి, తిరిగి ఇంటికి కూడా తీసుకు వచ్చే వాడిని అని పేర్కొన్నాడు. కొన్నిసార్లు కాలేజ్ కి బంక్ కొట్టి వైశాలి తనతో బయటకు వచ్చేదని, ప్రతి రోజు కనీసం మూడు గంటల సమయం స్పెండ్ చేసే వాళ్ళమని నవీన్ రెడ్డి చెప్పుకొచ్చాడు. ఇక తనతో గడిపిన కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉన్నాయని చెప్పిన నవీన్ రెడ్డి గత డిసెంబర్ 31న శంషాబాద్ ప్రాంతంలోని ఒక హోటల్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు టైం స్పెండ్ చేశామని, జనవరి 10వ తేదీన ఓ రిసార్ట్ లో రూం తీసుకొని ఇద్దరం ఉన్నామని చెప్పాడు.

 నవీన్ రెడ్డిపై నెగిటివిటీ.. పోలీసులను ఆశ్రయించానన్న నిందితుడు

నవీన్ రెడ్డిపై నెగిటివిటీ.. పోలీసులను ఆశ్రయించానన్న నిందితుడు

చాలా దగ్గరైన తర్వాత నిదానంగా వాళ్లకు తనపై అయిష్టం పెరిగిందని, పెద్దగా ఆస్తులు లేవని, తల్లిదండ్రులు చదువుకోలేదని వాళ్లకు తనపై నెగిటివిటీ పెరిగిందని, దాంతో తనను దూరం పెట్టడం మొదలు పెట్టారని నవీన్ రెడ్డి చెప్పాడు. వైశాలి తల్లిదండ్రులు తనను దూరం పెట్టడంతో, వైశాలి కూడా క్రమంగా తనకు దూరంగా జరుగుతూ వచ్చిందని నవీన్ రెడ్డి చెప్పాడు. ఆపై వైశాలికి యూకె, యూఎస్ సంబంధాలు చూస్తున్నట్లుగా తెలిసిందని, దీంతో తాను పోలీసులను ఆశ్రయించినా , పోలీసులు ఆడపిల్లకి సపోర్ట్ చేశారని నవీన్ రెడ్డి పేర్కొన్నాడు.

 అవకాశం ఇస్తే ఆధారాలతో తాను తప్పు చెయ్యలేదని నిరూపించుకుంటా

అవకాశం ఇస్తే ఆధారాలతో తాను తప్పు చెయ్యలేదని నిరూపించుకుంటా


ఇక వైశాలి నిశ్చితార్థం రోజు ఇద్దరు ముగ్గురు తాను వెళితే కొడతారు అని భావించి, ఎక్కువమందితో వాళ్ళ ఇంటికి వెళ్లా అని, ఇక ఆ తరువాత జరిగిన కథంతా మీకు తెలుసు అంటూ పేర్కొన్న నవీన్ రెడ్డి నాకు అవకాశం ఇస్తే నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటా అంటూ పేర్కొన్నారు. తన సెల్ ఫోన్ లో అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని, పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తుల్లో దాదాపు పది మందికి ఈ సంఘటనలతో సంబంధం లేదని నవీన్ రెడ్డి తెలిపాడు. మొత్తానికి ప్రస్తుతం నవీన్ రెడ్డి రిలీజ్ చేసిన వీడియోలతో అసలు ఈ కేసులో ఏం జరిగింది అన్నది అందరికీ ఆసక్తిని రేకెత్తిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+