వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తలసాని టు సురేఖ: పాటతో కెసిఆర్‌ను ఏకేసి, ఇంటర్నెట్లో పెట్టాడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తాము ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, కానీ ఆయన నీరుగారుస్తున్నారంటూ ఓ గ్రామీణ యువకుడు పాట పాడి దానిని ఇంటర్నెట్‌లో అప్ లోడ్ చేశాడు. ఇప్పుడు ఇది ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది.

కెసిఆర్ పాలన నుంచి మొదలు.. కుటుంబ పాలన, తెలంగాణ వ్యతిరేకులను మంత్రివర్గంలోకి తీసుకోవడం, మహిళలకు కేబినెట్లో చోటు కల్పించకపోవడం, ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటూ.. పాట రూపంలో ఉంచాడు.

కెసిఆర్ సారు.. మా కొత్త సీఎం గారు.. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేదంటే నిన్ను ఇంటికి పంపించడం ఖాయమని అందులో హెచ్చరించాడు. తెలంగాణ ప్రజల ఆవేదనను అర్థం చేసుకోవడం లేదని అభిప్రాయపడ్డాడు. మీరు మా గ్రామానికి వస్తే సమస్యలు తెలుస్తాయి దొర అంటూ పేర్కొన్నాడు.

కెసిఆర్ రూపంలో దేవుడు తమకు అండగా ఉండేందుకు వచ్చాడని భావించామని, అందుకే తెలంగాణ ఉద్యమం సమయంలో నెత్తిన పెట్టుకున్నామని, కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని అభిప్రాయపడ్డాడు.

Anti KCR song on YouTube says CM not in tune with Telangana

దళిత ముఖ్యమంత్రిని చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చావని, తనకు ఏ పదవులు వద్దని, వాచ్ డాగ్‌లా ఉంటానని చెప్పావని, ఆ తర్వాత నీవే పదవిలో కూర్చున్నావని, తెలంగాణ పునర్నిర్మాణం అని చెప్పారని, కానీ ఆ దిశగా చర్యలు కనిపించడం లేదని అభిప్రాయపడ్డాడు.

అదే సమయంలో కుటుంబంలో అందరికీ పదవుల పైన తన పాటలో ఆవేదన వ్యక్తం చేశాడు. కూతురు కవితను తెలంగాణ తల్లిని చేశావని, కొడుకు కెటిఆర్‌కు సిరిసిల్లను ఇచ్చావని, అల్లుడు హరీష్ రావుకు సిద్దిపేటను అప్పగించావని, కూతురు కవితను ఎంపీగా చేశావన్నారు.

దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పావని గుర్తు చేశారు. అధికారులను గ్రామాలకు పంపించి సర్వే చేయాలని సూచించావని, కానీ వారు హంగామా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

అదే సమయంలో తెలంగాణ ఉద్యమం సమయంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఉన్న టిడిపి నేతలకు మంత్రి పదవులు ఇచ్చారన్నారు. సమైక్యాంధ్రకు మద్దతు పలికిన తుమ్మలను, తలసానిలకు మంత్రి పదవులు ఇచ్చారని చెప్పాడు.

అదే సమయంలో జగన్ మద్దతుదారు, తెలంగాణవాదులపై రాళ్లు వేసిన కొండా సురేఖను పార్టీలో చేర్చుకొని టిక్కెట్ ఇచ్చారన్నాడు. అదే సమయంలో నిజమైన తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఇదంతా పాట రూపంలో చెప్పాడు. ఇది ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది. కాగా, ఇది మూడు నిమిషాల వీడియో.

English summary
The song by a rustic village youth in TS has warned Chief Minister K. Chandrasekhar Rao against not fulfilling his promises.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X