మనోడు మంచోడే వదిలేయ్: తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారికి ఆంధ్ర మంత్రి ఫోన్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఎయిర్ పోర్ట్ లో అక్రమంగా మద్యంతో పట్టుబడిన నిందితులను కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ మంత్రి తెలంగాణకు చెందిన ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారికి ఫోన్ చేశాడు. అయితే అన్ని రకాల ఆధారాలున్నందున అక్రమంగా మద్యం కలిగిఉన్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకొంటామని అకున్ సబర్వాల్ తేల్చి చెప్పారు.

హైద్రాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అక్రమంగా విదేశీ మద్యం కలిగిన నిందితులను తెలంగాణకు చెందిన అధికారులు పట్టుకొన్నారు.అయితే ఈ కేసును నీరుగార్చేందుకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి రంగంలోకి దిగారు.

తెలంగాణ రాష్ట్రంలోని అధికారులపై ఆంధ్రప్రదేశ్ కు చెందిన మంత్రి పెత్తనం చలాయించేందుకు ప్రయత్నించారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి అకున్ సబర్వాల్ కు ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి ఫోన్ చేసి మద్యం సీసాలతో పట్టుబడిన వారిని వదిలేయాలని కోరారు.

Ap minister phoned to Telangan Excise department to release customs department superindent

కస్టమ్స్ సూపరింటెండ్ మంచోడంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి అకున్ సబర్వాల్ కు రికమెండ్ చేశాడు.అయితే అన్ని ఆధారాలతో దొరికిన నిందితులను వదిలేసే సమస్యేలేదని సబర్వాల్ తేల్చిచెప్పాడు.

మరోవైపు సబర్వాల్ కు ప్రముఖుల నుండి విపరీతంగా ఫోన్లు వస్తున్నాయి. మద్యంతో పట్టుబడిన కస్టమ్స్ సూపరింటెండ్ ను వదిలేయాలంటూ ఫోన్లు చేస్తున్నారు.కస్టమ్స్ సూపరింటెండ్ ప్రముఖులకు నిత్యం విదేశీమద్యాన్ని సరఫరా చేసేవాడనే ఆరోపణలున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhrapradesh minister phoned to Telangan Excise department chief Akun Sabarwal to release customs department superindent, he has illicit liquor Telangana excise police found.But Akun Sabharwal didn't accepted Andhra Pradesh minister's request.
Please Wait while comments are loading...