వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్చ్.. రేవంత్ అంత చీప్ అయిపోయాడా..!

|
Google Oneindia TeluguNews

క్యాడర్ అంతా ఖాళీ అయిపోయి.. అధికార పక్షంతో తోక పార్టీ అని ముద్ర వేయించుకున్న టీటీడీపీ, చివరి దశలొ మిణుకు మిణుకుమంటోంది. ఓటుకు నోటు కేసు తర్వాత ఆ పార్టీ సీన్ అంతా మారిపపోయింది. అప్పటిదాకా అంతో ఇంతో తెలంగాణలో ఉనికిలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ ముద్ర వేయించుకున్న రేవంత్ రెడ్డిలో ఇప్పుడు మునుపటి ఫైర్ మిస్ అయినట్టే కనిపిస్తోంది. ఏపీలోని సొంత పార్టీ నేతలు కూడా రేవంత్ వినతులను లెక్క చేయని పరిస్థితి నెలకొందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దీనికి సంబంధించి టీడీపీ వర్గాల్లో కొన్ని గుసగుసలు వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ విషయమేంటంటే.. మే 27వ తేదీ నుంచి తిరుపతిలో టీడీపీ మహానాడు నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. మహానాడు సందర్బంగా ప్రవేశపెట్టబోయే ప్రతిపాదనలకు సంబంధించి రేవంత్ రెడ్డి కూడా ఓ ప్రతిపాదనను టీడీపీ ముందుంచారట. తెలంగాణలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న టీఆర్ఎస్ చర్యలకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టాలనేది ఆ ప్రతిపాదన ఉద్దేశం.

ap tdp said no for revanths proposal

అయితే.. రేవంత్ ఇచ్చిన ప్రతిపాదనకు 'నో' అనేశాయట ఏపీ టీడీపీ శ్రేణులు. టీఆర్ఎస్ పై ఫిరాయింపుల తీర్మానం ప్రవేశపెడితే, అది రివర్స్ లో టీడీపీనే టార్గెట్ చేసినట్టవుతుందనేది వాళ్ల వాదన. ఎందుకంటే ఏపీలో అధికార పక్షం కూడా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ వెళ్తోంది. ఇలాంటి సమయంలో తెలంగాణ ఫిరాయింపులపై తీర్మానం తీసుకొస్తే, అది సొంత పార్టీ ఇమేజ్ నే దెబ్బ తీస్తుందనే భావనతో రేవంత్ ప్రతిపాదనకు 'నో ఛాన్స్' అని కుండబద్దలు కొట్టేశారట
ఏపీ టీడీపీ నేతలు.

దీంతో.. చంద్రబాబుతోనే ఈ వ్యవహారాన్ని తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారట రేవంత్. మొండి పట్టుదలతో ఎలాగైనా తన ప్రతిపాదనకు చంద్రబాబుతో ఓకె చెప్పించుకోవాలనే యోచనలో ఉన్నట్టు ఏపీ టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్టుగా సమాచారం.

English summary
telangana tdp leader revanth reddy is trying to convince ap cm chandrababu naidu for a proposal to keep in tdp mahanadu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X