ఏపీ, తెలంగాణా జల జగడం : కేఆర్ఎంబీ మీటింగ్ నుండి తెలంగాణా వాకౌట్, నేడు ఢిల్లీకి .. తెగేలా లేదుగా!!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య చోటుచేసుకున్న జల వివాదాలను పరిష్కరించడానికి, అలాగే కేంద్రం తీసుకువచ్చిన గెజిట్ ను అమలు చేయడానికి నిన్న కృష్ణానది యాజమాన్య బోర్డు, గోదావరి నది యాజమాన్య బోర్డు హైదరాబాద్ లోని జలసౌధలో సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదాలను పరిష్కరించడానికి, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటి అవసరాలను చర్చించడానికి నిర్వహించిన సమావేశానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుండి అధికారులు హాజరయ్యారు.

ఒకరిపై ఒకరు ఫిర్యాదులతో ఏపీ, తెలంగాణా జలజగడం .. విద్యుత్ ఉత్పత్తి రగడ
రెండు తెలుగు రాష్ట్రాలు జల చౌర్యం పై పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటున్న సమయంలో కేంద్రం గెజిట్ జారీ చేసి నదీ జలాలపై హక్కులను కేంద్రం పరిధిలోకి తీసుకు వచ్చింది. అయినా సరే నేటికీ తెలుగు రాష్ట్రాల తీరు మారలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించిన నేపథ్యంలో మొదలైన జల జగడం నేటికీ కొనసాగుతుంది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రధానంగా ఆరోపిస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలలో చేస్తున్న విద్యుత్ ఉత్పత్తి కారణంగా ఆంధ్రప్రదేశ్ సాగు నీటి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, చెన్నైకి తాగునీరు కూడా ఉండదని విద్యుదుత్పత్తిని ఆపేయాలని ఏపీ సర్కార్ మెలిక పెట్టింది.

50: 50 లెక్కన నీటి పంపకాలు చెయ్యాలన్న తెలంగాణా .. మెలిక పెట్టిన ఏపీ
నదీజలాల పంపిణీ పై కూడా ఇరు రాష్ట్రాల వాదన ఒక దానికొకటి సంబంధం లేకుండా ఉంది. ఈ క్రమంలో తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల జల జగడాన్ని పరిష్కరించడానికి రంగంలోకి దిగిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి నది మేనేజ్మెంట్ బోర్డులు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యాయి. నిన్న జరిగిన సమావేశంలో ఏపీ వాదనకు అనుకూలంగా కృష్ణా బోర్డు మొగ్గు చూపిందని తెలంగాణా అధికారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

జలసౌధలో కేఆర్ఎంబీ భేటీ .. బలంగా వాదనలు వినిపించిన ఇరు రాష్ట్రాలు
నిన్న జలసౌధలో జరిగిన సమావేశం వాడి వేడిగా సాగగా ఎవరి వాదనను వారు బలంగా వినిపించారు. నదీజలాల పంపిణీ లో 50: 50 వాటా పంపిణీ చేయాలని తెలంగాణ విజ్ఞప్తి చేయగా, గతంలో ఏ విధంగా అయితే తెలంగాణకు 34 శాతం ఆంధ్రప్రదేశ్ కు 66 శాతం నీటి వాటా ఉందో అదే విధంగా వినియోగించుకోవాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నిర్ణయించింది. అంతేకాదు శ్రీశైలంలో తెలంగాణ రాష్ట్రం ఉత్పత్తి చేస్తున్న జల విద్యుత్ వ్యవహారంపై రెండు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాయి.

ఏపీ వాదనకే మొగ్గు చూపిన కృష్ణా బోర్డు .. తెలంగాణా వాకౌట్
శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి వల్ల ఏపీ సాగునీటి కష్టాలు, చెన్నై తాగునీటి కష్టాలు ఎదుర్కోవాలని, పూర్తి నీటి సామర్ధ్యం లేకుండానే చేస్తున్న జలవిద్యుత్ ఉత్పత్తిని నిలుపుదల చెయ్యాలని ఏపీ కోరింది. శ్రీశైలం ప్రాజెక్టు జలవిద్యుత్ కేంద్రం అని, విద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతామని తెలంగాణ రాష్ట్రం వాదిస్తే, సాగునీటి తాగునీటి ప్రయోజనాల తరువాతే జల విద్యుత్ ఉత్పత్తి అంటూ ఏపీ తమ వాదన వినిపించింది. ఈ క్రమంలో మొదట సాగునీరు, తాగునీరు అవసరాలు ఆ తర్వాతే విద్యుత్ ఉత్పత్తి జరగాలని, శ్రీశైలంలో ప్రస్తుతం జరుగుతున్న విద్యుత్ ఉత్పత్తిని ఆపేయాలని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ చైర్మన్ చెప్పడంతో ఏకపక్ష నిర్ణయంగా భావించిన తెలంగాణ సమావేశం నుంచి వాకౌట్ చేసింది. తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.

నేడు ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణా ఇరిగేషన్ అధికారులు.. కేంద్ర మంత్రికి విజ్ఞప్తి
ఇక తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నదీజలాల పంపకాలు, అలాగే శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తిపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏపీకి అనుకూలంగా మాట్లాడడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన తెలంగాణ ఇరిగేషన్ అధికారులు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర జల శక్తి మంత్రిని కలిసి వారి వినతిపత్రాన్ని సమర్పించనున్నారు. గజేంద్ర షెకావత్ తో భేటీ అయి నీటి పంపకాలు, కొత్త ప్రాజెక్టులపై చర్చించనున్నారు కృష్ణా నీటిలో 50 : 50 ప్రాతిపదికన పంపిణీ జరగాలని, అలాగే విద్యుదుత్పత్తి కూడా అనుమతి ఇవ్వాలని దీనితోపాటు కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు పై కూడా గజేంద్ర షెకావత్ తో చర్చించనున్నారు తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు.
-
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications