క్యాన్సర్‌ చికిత్స: రూ. 1,250 కోట్లు వెచ్చిస్తామని ప్రతాప్ సి రెడ్డి

హైదరాబాద్: కేన్సర్‌ వ్యాధి చికిత్స, నివారణ, ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కోసం భారత్‌లో 1,250 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు అపోలో హాస్పిటల్స్‌ చైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగా చెన్నై లో 650 కోట్ల రూపాయలతో అత్యాధునిక ప్రోటాన్‌ టెక్నాలజీ యూనిట్‌ను నెలకొల్పుతున్నట్లు తెలిపారు.

ఈ విభాగం 2018 నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు. భారత్‌లో ఏటా పది లక్షల మంది కేన్సర్‌తో మరణిస్తున్నారని తెలిపారు. గుండె జబ్బు లు, కేన్సర్‌, షుగర్‌ వ్యాధి, సాంక్రమిక వ్యాధు లు.. భవిష్యతలో ప్రజల జీవితాలపై పెను ప్రభా వం చూపుతాయని అంచనా వేశారు.

ఇప్పటికే కేన్సర్‌ చికిత్స అందిస్తున్న ఆసుపత్రులలో సదుపాయాలను మెరుగుపరిచి ఈ విభాగాన్ని ప్రత్యేకంగా వేరుచేసి అపోలో కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లుగా అభివృద్ధి చేయనున్నట్లు అపోలో హాస్పిటల్స్‌ ఛైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డి తెలిపారు.

అంతేగాక, కేన్సర్‌పై విజయం సాధించాలన్న లక్ష్యంతో మెరుగైన కేన్సర్‌ చికిత్సను అందుబాటులోకి తీసుకురావాలని అపోలో నిర్ణయించిందని ప్రతాప్‌ సి రెడ్డి తెలిపారు. కొన్ని రకాల కేన్సర్లు చేయి దాటిపోతే చికిత్స కష్టమని, అందువల్ల అప్పుడప్పుడు ప్రాథమిక పరీక్షలు (స్క్రీనింగ్‌ పరీక్షలు) చేయించుకోవడం వల్ల పెద్ద ప్రమాదాలను ముందుగానే పసిగట్టవచ్చన్నారు.

అత్యాధునిక రోబో ఆధారిత చికిత్స ద్వారా ట్యూమర్‌ కణాలను మాత్రమే తొలగించి ఇతర కణాలకు ఎటువంటి నష్టం లేకుండా రోగి త్వరగా కోలుకునే చిక్సితను అందించనున్నామని, థోమో థెరపీ, ప్రోటాన్‌ థెరపీల వంటి అత్యాధునిక థెరపీలను ప్రవేశపెట్టనున్నామని చెప్పారు.

ఒకే రకం కేన్సరైనా ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా వ్యక్తిగత స్థాయిలో అధ్యయనం చేసి ఆ వ్యక్తికి అనుగుణంగా ఔషధాలు (పర్సనలైజ్డ్‌ ఔషధాలు), చికిత్స చేయాల్సి ఉంటుందని (ప్రెసిషన్‌ అంకాలజీ) రెడ్డి పేర్కొన్నారు. ఇటువంటి చికిత్స వల్ల రోగి త్వరగా కోలుకుంటాడని వివరించారు.

అపోలో ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డి

అపోలో ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డి

‘ఆగ్నేయాసియాలోనే తొలిసారిగా ఈ థెరపీని అపోలో ప్రవేశపెడుతోంది. ప్రోటాన్‌ థెరఫీకి విదేశాలకు వెళ్తే.. రూ.5 కోట్ల వరకూ ఖర్చవుతుంది. దీన్ని రూ.12-15 లక్షలకు ఇక్కడ అందించనున్నాం' అని తెలిపారు.

అపోలో ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డి

అపోలో ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డి

‘అపోలో ఆసుపత్రులకు వచ్చే రోగుల్లో నాలుగో వంతు మంది కేన్సర్‌ రోగులే. అపోలోకు ఆసుపత్రుల ద్వారా లభించే ఆదాయంలో 20-22 శాతం కేన్సర్‌ చికిత్స ద్వారానే లభిస్తోంది'అని వివరించారు.

అపోలో ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డి

అపోలో ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డి

‘అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన సేవలను అందిస్తే.. మరింతమంది రోగులు కేన్సర్‌ చికిత్సకు రాగలరని ఆదాయంలో ఈ విభాగం వాటా 30 శాతాన్ని మించగలదని అంచనా వేస్తున్నాం. చెన్నై, హైదరాబాద్‌, ఢిల్లీ, కోల్‌కతా, అహ్మదాబాద్‌ తదితర మొత్తం తొమ్మిది అపోలో ఆసుపత్రుల్లోని కేన్సర్‌ సదుపాయాలను వేరుచేసి కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లుగా అభివృద్ధి చేస్తాం' అని తెలిపారు.

అపోలో ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డి

అపోలో ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డి

‘భవిష్యత్తులో మరిన్ని కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లను ఏర్పాటు చేస్తాం. అపోలో ఆసుపత్రుల్లో దాదాపు 700 మంది కేన్సర్‌ వైద్య నిపుణులు ఉన్నారు. వీరందరూ ఒక ఉమ్మడి వేదికపైకి వచ్చి ‘ట్యూమర్‌ బోర్డులు'గా ఏర్పడి చికిత్స సమయంలో సమాచారాన్ని పంచుకుని అన్ని అపోలో ఆసుపత్రుల్లో ఆయా రోగులకు గరిష్ఠంగా మేలు చేసే కేన్సర్‌ చికిత్సను అందుబాటులోకి తీసుకువస్తార'ని ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+