నిరుద్యోగులకు మంచి అవకాశం... టీ-సేవా కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం...

నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. తెలంగాణవ్యాప్తంగా టీ-సేవా కేంద్రాల ఏర్పాటు కొరకు ఆసక్తిగల అభ్యర్థుల నుంచి టీ-సేవా సంస్థ దరఖాస్తులు కోరుతోంది. మార్చి 30 దరఖాస్తులకు చివరి తేదీగా ఆ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు టీ సేవా సంస్థ డైరెక్టర్ వెంకట్ రెడ్డి అడపా ఒక ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు,మండలాలు,పట్టణాలు,నగరాల్లో ఎక్కడైనా సరే టీ-సేవా కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు.నిరుద్యోగ యువకులు స్వయం ఉపాధి పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం టీ సేవా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ద్వారా బస్, ట్రైన్ టికెట్లు బుక్ చేయడం, బిల్లుల చెల్లింపు, బ్యాంక్‌, ఇన్సూరెన్స్‌, పాన్‌ కార్డ్‌ వంటి సేవలను పొందవచ్చు.

applications invited from candidates to set up t seva centres all over telangana

అలాగే పాన్ కార్డ్ నమోదు,వివరాల సవరణ,మైక్రో ఏటీఎం సర్వీసులు,మనీ ట్రాన్సాక్షన్స్,టెలీకాం రీచార్జీలు,డీటీహెచ్,డేటా కార్డులు,డెబిట్ కార్డుల జారీ,నగదు ఉపసంహరణ,ఫాస్టాగ్ పేమెంట్స్,గోల్డ్ లోన్స్,20 పైచిలుకు కంపెనీల్లో క్యాష్ ఇన్ సర్వీస్,స్కిల్ డెవలప్‌మెంట్ తదితర సేవలను వీటి ద్వారా పొందవచ్చు.

స్వర్ణ తెలంగాణ స్వయం ఉపాధి పథకం కింద దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓబీసీలు ఆర్థికంగా వెనకబడిన అభ్యర్థులు, దివ్యాంగులు, పదవీ విరమణ చేసిన సైనికులు, మహిళలకు రిజిస్ట్రేషన్ ఫీజులో 25శాతం ప్రత్యేక రాయితీ కల్పిస్తారు.పూర్తి వివరాలకు www.tsevacentre.com వెబ్‌సైట్ లేదా ఫోన్ నం.8179955744లో సంప్రదించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+