వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ పార్ధసారధి నియామకం .. గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పార్థసారథి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్లపాటు పార్థసారథి ఈ పదవిలో కొనసాగనున్నట్లుగా తెలుస్తోంది.

గ్రామ రెవెన్యూ వ్యవస్థ రద్దు.. 12గంటల్లోనే వీఆర్వోల నుండి దస్త్రాలు వెనక్కు.. కేసీఆర్ మార్క్గ్రామ రెవెన్యూ వ్యవస్థ రద్దు.. 12గంటల్లోనే వీఆర్వోల నుండి దస్త్రాలు వెనక్కు.. కేసీఆర్ మార్క్

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మొదటి ఎన్నికల కమిషనర్ గా నాగిరెడ్డి నియమించింది . ఇప్పటివరకు ఆయన అయిదేళ్ల పదవీకాలం పూర్తి కావడంతో ప్రస్తుతం ప్రభుత్వం పార్థసారథి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ తో నాగిరెడ్డి పదవీకాలం ముగిసింది . దాంతో ఇప్పుడు పార్ధసారధికి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు .

Appointment of Senior IAS Parthasarathy as Telangana State Election Commissioner

తెలంగాణ రాష్ట్ర తొలి ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి పదవీకాలం ముగిసి దాదాపు 5 నెలలు కావస్తుంది . రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారన్న ఉత్కంఠకు తెర దింపుతూ పార్ధ సారధికి అవకాశం దక్కింది . గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్​ఎన్నికలు సమీపిస్తున్నందున పార్ధసారధిని కొత్త కమిషనర్ నియమిస్తూ ప్రభుత్వ నిర్ణయంపై ఇప్పుడు చర్చ జరుగుతుంది .

1993 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన పార్థసారథి ఆదిలాబాద్ డిఆర్డిఎ పీడీగా ఆయన తన కెరీర్ ను ప్రారంభించారు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి స్థాయిలో పనిచేసి రిటైర్ అయ్యారు. అగ్రికల్చర్ ఎమ్మెస్సీ చేశారు పార్థసారథి . ఒకటి రెండు రోజుల్లో ఆయన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ , గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఇంకా జరగాల్సి ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పాలకమండలి పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో పూర్తి కానుంది.

కొత్త పాలకమండలి కోసం జనవరిలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అందుకే కొత్త ఎన్నికల కమిషనర్‌ను నియమిస్తే బాగుంటుందన్న అభిప్రాయం మేరకు పార్ధసారధిని నియమించారు . కొత్త ఎన్నికల కమిషనర్‌ రేస్‌లో పలువురు రిటైర్డ్‌ IAS అధికారులు ఉన్నప[ప్పటికీ వీరిలో పార్థసారథి వైపే ప్రభుత్వం మొగ్గు చూపింది .ఎన్నికల కమీషనర్ రేసులో పార్ధసారధితో పాటు బీపీ ఆచార్య, రంజీవ్‌ ఆచార్య పేర్లు పరిశీలనలో ఉండగా ప్రభుత్వం పార్ధసారధిని నియమించింది.

English summary
Retired IAS officer Parthasarathy has been appointed as the Telangana state election commissioner. The government has issued orders to this effect. It seems that Parthasarathy will continue in this post for three years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X