అప్సర హత్య కేసులో మరో ట్విస్ట్: ఆమెకు అప్పటికే మరొకరితో పెళ్లి

హైదరాబాద్: నగరంలో హత్యకు గురైన అప్సర కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్సరకు ఇప్పటికే మరో వ్యక్తితో వివాహం జరిగినట్లు తాజాగా కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమెను వివాహం చేసుకున్న వ్యక్తి గురించిన వివరాలు తెలియాల్సి ఉంది. తన భర్తతో విడిపోయిన తర్వాత తల్లిదండ్రులతో ఉంటున్న అప్సర.. పూజారి వెంకటసాయికృష్ణతో ప్రేమలో పడి చివరకు హత్యకు గురైంది.

భర్తతో విభేదాల కారణంగా పుట్టింట్లో ఉంటున్న అప్సర.. జాతకం కోసం మొదట వెకంట సాయికృష్ణ వద్దకు వెళ్లింది. ఇలా పలుమార్లు అతడ్ని కలిసింది. దీంతో వీరిద్దరి మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్ని రోజులపాటు ఎవరికీ తెలియకుండా వారి బంధాన్ని కొనసాగించారు. ఈ క్రమంలోనే తనను పెళ్లి చేసుకోవాలని అప్సర.. సాయికృష్ణపై ఒత్తిడి పెంచింది. దీంతో ఎలాగైనా ఆమెను అడ్డుతొలగించుకోవాలని జూన్ 3న అప్సరను దారుణంగా హత్య చేశాడు సాయికృష్ణ.

 apsaramurdercase

కాగా, అప్సర హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్సర గర్భవతి కాదంటూ ప్రిలిమినరీ పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఇచ్చారు వైద్యులు. చనిపోయే సమయానికి అప్సర గర్భవతని.. దాని విషయంలోనే గొడవ జరిగిందని ముందుగా ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేదని ఈ రిపోర్ట్‌తో క్లారిటీ వచ్చింది. తలకు బలమైన గాయాలు కావడంతోనే అప్సర ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులకు వైద్యులు తెలిపారు.

ఇది ఇలావుండగా, నిందితుడు సాయికృష్ణ.. అప్సరను హత్య చేసే ముందు ఇంటర్నెట్‌లో మనిషిన ఎలా చంపాలనే విషయాలపై వెతికినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. అప్సర హత్య కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను వెల్లడించారు. ఆమెను అడ్డు తొలగించుకునేందుకే సాయికృష్ణ హత్య చేసినట్లు తేలింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి పూజారి సాయికృష్ణ, అప్సర మధ్య పరిచయం ఏర్పడిందని.. క్రమంగా అది వివాహేతర సంబంధానికి దారితీసిందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

సరూర్‌నగర్‌లోని బంగారు మైసమ్మ ఆలయం కేంద్రంగానే ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. సాయికృష్ణ తరచూ అప్సరకు వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు చేస్తుండేవాడు. ఇద్దరూ గత నవంబర్ నెలలో గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం, ద్వారక గుడిని సందర్శించారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య బంధం మరింత బలపడింది. అప్సర వాట్సాప్ ద్వారా తన ప్రేమను వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసింది. తనను పెళ్లి చేసుకోకపోతే రోడ్డుకు ఈడుస్తానని బెదిరించింది. అందుకే సాయికృష్ణ ఆమెను అడ్డుతొలగించాలనుకొని హత్య చేశాడు. ఇదే విషయాన్ని అతడు కూడా అంగీకరించాడు అని రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు.

apsaramurdercase

ఇక హత్యకు వారం రోజుల ముందు 'మనిషిని చంపడం ఎలా?' అనే విషయంపై సాయికృష్ణ ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. తనను కోయంబత్తూర్‌కు తీసుకెళ్లాలని అంతకుముందు అప్సర పలుమార్లు కోరడంతో.. దానినే ఆమెను హత్య చేసేందుకు ఆసరా చేసుకున్నాడు. జూన్ 3వ తేదీన రాత్రి 9 గంటలకు కోయంబత్తూర్‌కు టికెట్ బుక్ చేశానని అప్సరను నమ్మించిన సాయికృష్ణ.. ఆమెను కారులో ఎక్కించుకుని రాత్రి 8.15 గంటలకు సరూర్‌నగర్ నుంచి బయల్దేరాడు.

రాత్రి 9 గంటలకు ఇద్దరూ శంషాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి చేరుకున్న తర్వాత టికెట్ బుక్ చేయలేదని చెప్పి.. అక్కడ్నుంచి గోశాలకు తీసుకెళ్లాడు. రాత్రి భోజనం కోసం రాళ్లగూడ వద్ద ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ వద్ద కారు ఆపారు. అప్పటికే ఆరోగ్యం బాగోలేక ఒకసారి వాంతి చేసుకుంది అప్సర.

అర్ధరాత్రి 12 గంటలకు ఇద్దరూ సుల్తాన్‌పల్లిలోని గోశాలకు చేరుకున్న ఆమె నిద్రిస్తున్న సమయంలో సాయికృష్ణ హత్య చేశాడు అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఆమె నిద్రిస్తున్న సమయంలోనే కారు కవర్‌తో ఊపిరాడకుండా చేసి, బండరాయితో బాది హత్య చేశాడు సాయికృష్ణ. కాగా, ఈ కేసులో నిందితుడిగా ఉన్న సాయికృష్ణను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. శంషాబాద్ పోలీసులు సాయికృష్ణను జడ్జి ఎదుట హాజరుపర్చగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నిందితుడిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.

కాగా, బంగారు మైసమ్మ దేవాలయానికి సంప్రోక్షణ చేశారు పూజారులు. అప్సర హత్య తర్వాత ఐదుసార్లు ఆలయానికి వచ్చాడు సాయికృష్ణ. దీంతో అప్సర అంత్యక్రియల అనంతరం.. ఆలయంలో శాంతి హోమం జరిపించాలని నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+