ఒరిజినల్ అట్లనే ఉన్నడు.!మెడలు వంచుడు కాదు ఇరుస్తం.!ఈ వ్యాఖ్యలే మిర్యాలగూడ ఎటాక్ కి కారణమా.?

హైదరాబాద్ : ఒక్క అడుగు చరిత్రనే మార్చేసినట్టు ఒక్క ఎన్నిక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను పూర్తి వైవిధ్యంగా మార్చేసింది. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత రాష్ట్ర రాజకీయాలు పూర్తి విరుద్దంగా మారిపోయాయి. సమీప భవిష్యత్తులో రాజకీయ ప్రత్యర్ధులు లేరు అనుకున్న గులాబీ బాస్ కు బీజేపి చెమటలు పట్టించిన సందర్బం చోటుచేసుకుంది. హుజురాబాద్ ఉప ఎన్నికతో బీజేపిని మట్టికరిపించి కోలుకోని దెబ్బ కొట్టాలని అధకార టీఆర్ఎస్ పథకాలు రచిస్తే, అధికార పార్టీ అహంకారాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలని బీజేపి వ్యూహం రచించింది. ఇరు పార్టీల హోరా హోరీ పోరులో బీజేపి పైచేయి సాధించింది. అసలు సిసలైన రాజకీయం ఇక్కడే మొదలైనట్టు తెలుస్తోంది.

రాజకీయ ప్రశాంతతకు భగ్నం..

రాజకీయ ప్రశాంతతకు భగ్నం..

హుజురాబాద్ ఓటమితో అధికారంలో ఉన్న గులాబీ పార్టీ ఇగో బాగా హర్ట్ ఐన సందర్బం చోటుచేసుకుంది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పైన సీఎం చంద్రశేఖర్ రావు తీవ్రంగా స్పందించడం, సీఎం లో ఉద్యమం నాటి ఒరిజినాలిటీ అలాగే ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొనడం రాష్ట్రంలో భావోద్వేగాలను రెచ్చగొట్టినట్టయ్యింది.దాని పర్యవసానమే బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ పై ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గులాబీ శ్రేణులు దాడులకు పాల్పడ్డారనే చర్చ జరుగుతోంది. దీంతో రాజకీయ ప్రశాంతత ఉండే తెలంగాణలో ఒక్క సారిగా ఎమోషనల్ రాజకీయాలకు తెరలేసిందా అనే కోణంలో విశ్లేషణలు మొదలయ్యాయి.

నల్లగొండ జిల్లాలో బండి సంజయ్ పై ఎటాక్.

నల్లగొండ జిల్లాలో బండి సంజయ్ పై ఎటాక్.

హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు స్వీయ నియంత్రణ కోల్పోయారనే అంశం రుజువవుతోంది. ఎవ్వరినీ తన రాజకీయ ప్రత్యర్ధిగా అంగీకరించని చంద్రశేఖర్ రావు బండి సంజయ్ అంశంలో మాత్రం కలవరానికి గురైనట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టు గానే అనూహ్యంగా రెండు మీడియా సమావేశాలు నిర్వహించి తెలంగాణ బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ దాదాపు మూడు గంటల సేపు ప్రసంగించారు. తర్వాత కొన్ని బావోద్వేగ వ్యాఖ్యలు కూడా ముఖ్యమంత్రి నోటివెంట వెలువడ్డాయి. దీంతో గులాబీ శ్రేణులు చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది.

 నియంత్రణ కోల్పొయిన గులాబీ కార్యక్తలు..

నియంత్రణ కోల్పొయిన గులాబీ కార్యక్తలు..

అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన నిరసన దీక్షా కార్యక్రమాల్లో గులాబీ నేతలు మోతాదుకు మించి బీజేపి పార్టీ పైన విరుచుకు పడ్డట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వినూత్న వ్యాఖ్యలు చేసారు. సిరిసిల్ల దీక్షా వేదిక మీద నుండి ఆయన చేసిన ప్రసంగాన్ని పార్టీ హార్డ్ కోర్ అభిమానులు బాగా అర్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. సీఎం ఐనంత మాత్రాన మనిషి ఏం మారలేదు, ఉద్యమకాలం నాటి ఒరిజినాలిటీ చంద్రశేఖర్ రావులో అలాగే ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యల అర్ధం, పరమార్దం ఎలా ఉన్నా గులాబీ శ్రేణుల ఒరిజినాలిటీని మాత్రం మిర్యాలగూడ పర్యటనలో ఉన్న బండి సంజయ్ మీద తీవ్రంగా చూపించినట్టు తెలుస్తోంది.

 దాడులు ప్రతిదాడులతో ఒరిగేది ఏంటి..

దాడులు ప్రతిదాడులతో ఒరిగేది ఏంటి..

దీంతో చంద్రశేఖర్ రావు చూసుకుందం బిడ్డా అని వ్యాఖ్యానించడం, కేటీఆర్ చంద్రశేఖర్ రావు లోని ఉద్యమ ఒరిజినాలిటీ గురించి మరొక్క సారి తెలంగాణ వాదులకు గుర్తు చేయడం, మంత్రులు సైతం బీజేపి నాయకులపైన చేస్తున్న అనుచిత వ్యాఖ్యల ప్రభావం తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నట్టు సోమవారం నాటి బండి సంజయ్ మిర్యాలగూడ పర్యటన రుజువు చేస్తోంది. రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణల స్థాయినుండి దాడులు చేసుకునే వరకూ తెలంగాణ రాజకీయం వెళ్లిందంటే దాని వెనక ప్రభావితం చేస్తున్న పరిణామాలను బీజేపి తీవ్రంగా పరిగణిస్తోంది.

రాజకీయాల్లో దాడులు, ప్రతిడులు చేసుకుంటే ప్రజా స్వామ్యానికి విలువ ఎక్కడుంటుందని బీజేపి ప్రశ్నిస్తోంది. ఒక్క ఉప ఎన్నిక ఓటమితో నియంత్రణ కోల్పోతే రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతకూల ఫలితాలు వస్తే గులాబీ నేతల పరిస్థితి ఏంటని బీజేపి ప్రశ్నిస్తోంది. వాస్తవంగా ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నే.!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+