Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పిల్లలను ఇష్టం లేని కోర్సులలో చేర్పిస్తున్నారా? ఈ కన్నీటి కథనం మీ కోసమే

చాలామంది చదువు విషయంలో పిల్లల పైన విపరీతమైన ఒత్తిడిని తెస్తూ ఉంటారు. ఇదే చదవాలి అదే చదవాలి అని వారి కోరికలను పిల్లలపైన రుద్దుతూ ఉంటారు. అలా ఇష్టం లేని చదువులను పిల్లలతో చదివించాలి అనుకునే వారికి హెచ్చరిక. మీ పిల్లల భవిష్యత్తు, మీ పిల్లల జీవితం బాగుండాలి అనుకుంటే పొరపాటున కూడా అటువంటి ప్రయోగాలు చేయకూడదని, పిల్లలను బలవంతపు చదువులు చదివించకూడదని చెబుతున్నారు మానసిక నిపుణులు.

సూసైడ్ నోట్ రాసి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
ఒకవేళ బలవంతపు చదువులు చదివిస్తే ఏం జరుగుతుందో తాజాగా జరిగిన ఒక ఘటన అందరికీ కనువిప్పుగా మారిందని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరికి కన్నీళ్లు తెప్పించే విషాదకరమైన ఆ ఘటన ఏమిటంటే.. హన్మకొండ జిల్లాలో 16సంవత్సరాల ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హనుమకొండ నయీం నగర్ లోని ఓ కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మిట్టపల్లి శివాని ఆత్మహత్యకు ముందు ఒక లేఖ రాసి మరీ ఆత్మహత్య చేసుకుంది.

Are you joining your children in courses forcefully This tear-jerking story of inter student who committed suicide

Take a Poll

తల్లిదండ్రులకు కనువిప్పు కలిగించే లేఖ
తాను ఎదుర్కొంటున్న మానసిక సమస్యను చెప్పి ఎవరు తనలాగా బలి కాకూడదని, ఇది చదివిన ప్రతి తల్లిదండ్రులకు కనువిప్పు కలిగించింది. ప్రతి అక్షరాన్ని ఒక కన్నీటి చుక్కగా మార్చి విద్యార్థిని రాసిన లేఖ యావత్తు సమాజాన్ని ఆలోచింపజేస్తుంది. ఆ లేఖలో విద్యార్థిని యొక్క మనోవేదన ప్రస్ఫుటంగా కనిపించింది. ఇష్టం లేని చదువులు చదివితే ఎంత దారుణంగా ఉంటుందో తన పరిస్థితిని వివరించింది.

విద్యార్థిని రాసిన లేఖలో ఏం చెప్పిందంటే
ఇష్టం లేని చదువు చదవలేక, తాను ఎలా నలిగి పోయానో అర్థమయ్యేలా చెప్పింది. తన చెల్లెలిని బాగా చదువుకోమని చెబుతూ, తనకు నచ్చిన కోర్సుని ఎంచుకొని చదువుకోమని సూచించింది. ఇక ఆ విద్యార్థిని రాసిన లేఖలో చెల్లిని బాగా చదివించండి. మంచి కాలేజీలో మంచి గ్రూపు తీసుకోమని చెప్పండి. నాలాగా అర్థం కాని చదువు వద్దు... దాన్ని మంచిగా చదివించి, మీరు కూడా బాగుండండి అంటూ ఆ లేఖలో పేర్కొంది.

ఫీజ్ కట్టారు కాబట్టి ఏదో చదివా.. కానీ తన వల్ల కాదంటూ లేఖ
కాలేజీలో జాయిన్ చేసే ముందు ఎవరినైనా కొంచెం అడిగి జాయిన్ చేయమని సూచించింది. తనకు చదువు అర్థం కావడంలేదని, చాలా టెన్షన్ గా ఉంటుందని, తాను చదువుకుంటా అన్న చదువుకు తల్లిదండ్రులు ఒప్పుకోలేదని లేఖలో పేర్కొంది. ఏమీ అర్థం కాక మధ్యలో నలిగిపోతున్నానని పేర్కొంది. మీరు ఫీజు కట్టారు కాబట్టి ఏదోలాగా చదివానని, ఇంకా తన వల్ల కాదంటూ ఆ లేఖలో పేర్కొంది.

ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నానని సూసైడ్ లెటర్
ఈ ఒత్తిడి తట్టుకోలేక తాను చనిపోతున్నాను అని తెలిపింది .ఎంత కష్టపడినా తనకు మార్కులు రావడం లేదని తనకు తక్కువ మార్కులు రావడం తల్లిదండ్రులు తట్టుకోలేరు కాబట్టే చనిపోతున్నానని విద్యార్థిని తన లేఖలో రాసింది. ఇక ఈ లేఖ పిల్లల పైన ఒత్తిడి పెట్టి చదివించాలి అనుకునే తల్లిదండ్రులకు, తమకు ఇష్టమైన కోర్సులు పిల్లల మీద రుద్దాలని చూసే తల్లిదండ్రులకు ఒక కనువిప్పు కావాలి. తల్లిదండ్రులు ఇటువంటి ఘటనల తర్వాత పిల్లల చదువుల విషయంలో మారాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+