వారిద్దరికే: జమిలి ఎన్నికలపై అసదుద్దీన్ ఒవైసీ తేల్చేశారు

జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. తాను ఒకే దేశం ఒకే ఎన్నికలను పూర్తిగా వ్యతిరేకించానని ప్రకటించారు. ఎందుకంటే ఇది ఫెడరలిజాన్ని నాశనం చేస్తుందని ఎక్స్ వేదికగా అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు.

రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణంలో భాగమైన ప్రజాస్వామ్యాన్ని ఇది రాజీ చేస్తుందని అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శించారు. ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్​ షాకు తప్ప ఎవరికీ బహుళ ఎన్నికలు సమస్య కాదని స్పష్టం చేశారు. ఈ అంశం పురపాలక సంఘం, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

Asaduddin Owaisi responded on Jamili election issue

జమిలి ఎన్నికలపై కేంద్ర మంత్రివర్గం ఆమోదం నేపథ్యంలో దేశానికి ఏకకాల ఎన్నికలు అవసరం కాదని అసదుద్దీన్ ఒవైసీ తేల్చిచెప్పారు. తరచుగా ఆవర్తన ఎన్నికలు ప్రజాస్వామ్య జవాబు దారీతనాన్ని మెరుగుపరుస్తాయని ఒవైసీ వ్యాఖ్యానించారు.

మరోవైపు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా జమిలి ఎన్నికలను వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదన ఆచరణాత్మకమైనది కాదని పేర్కొన్నారు. ఇది ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమని, దీనిని ప్రజలు అంగీకరించరని అన్నారు. కాగా, కాంగ్రెస్ తోపాటు 15 పార్టీలు ఈ విధానాన్ని వ్యతిరేకించాయి.

కాగా, జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ బుధవారం గ్రీన్ సిగ్నల్​ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రూపొందించిన నివేదికను మంత్రి వర్గం ఆమోదించింది. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులతో సహా 32 పార్టీలు ప్రముఖ న్యాయమూర్తులు దీనిని సమర్థించారు. 18 రాజ్యాంగ సవరణలను ప్యానల్ సిఫార్సు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+