గాంధీని చంపిన గాడ్సే ఎలా గొప్పవాడు అవుతాడు... కమల్ చెప్పింది కరక్టే.. ఓవైసీ
తమిళనాడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఎన్ఎం పార్టీ చీఫ్ నటుడు కమలహాసన్ చేసిన వ్యాఖ్యలను హైదరబాద్ ఎంపీ ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ సమర్ధించారు. గాంధీ లాంటీ వ్యక్తిని చంపిన నాధూరాం గాడ్సే లాంటీ హంతకుడినికి గొప్పవాడిగా ఎలా చిత్రీకరిస్తారని ఆయన ప్రశ్నించారు. హిందు ఉగ్రవాదం గురించి నోరెత్తని వారు మహాత్మ గాంధీని చంపింది ఎవరో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తమిళనాడులోని ఉప ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ స్వతంత్ర్య భారత దేశ మొదటి తీవ్రవాదీ ఒక హిందువే అంటూ మహాత్మాగాంధిని కాల్చి చంపిన నాథూరాం గాడ్సేను ఉద్దేశించి మాట్లాడారు..నాథూరాం గాడ్సే హిందు సంస్థలకు ప్రతినిధి వెళ్లడించారు. దీంతో దేశవ్యాప్తంగా అటు హిందుత్వవాదులు కమల్ హసన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు.

మొత్తం మీద కమలహాసన్ వ్వాఖ్యలతో అటు అటు హిందు అనుకూల ,వ్యతిరేక గ్రూపుల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఈనేపథ్యంలోనే కమల్ హాసన్ వ్యాఖ్యలను తమిళనాడు కాంగ్రెస్ పార్టీతోపాటు హిందూ పలు రాజకీయ పార్టీల నుండి కూడ మద్దతు లభిస్థోంది. ఇక కమలహాసన్ పై ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధించాలని బీజేపీ ఈసీని ఆశ్రయించింది. కాగా కమల్ హాసన్ నాలుకను కోయాలని తమిళనాడు మంత్రి రాజా సైతం ఫైర్ అయ్యారు.












Click it and Unblock the Notifications