ఆసరా వృద్ధాప్య ఫించన్లు... గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి ఎర్రబెల్లి..అర్హులైన ప్రతీ ఒక్కరికీ మూడో రోజుల్లో మంజూరు

తెలంగాణలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ మూడు రోజుల్లోగా ఆసరా ఫించన్లు మంజూరు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. అర్హుల ఎంపిక పారదర్శకంగా జరగాలన్నారు.రాష్ట్రంలో అర్హులైన, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నిరుపేద కుటుంబాలకు పెన్షన్లు అందించాలనే సంకల్పంతో సీఎం పెన్షన్లు పొందడానికి కనీస వయస్సును 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించారన్నారు.రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా అమలవుతున్న వివిధ పథకాలపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ క్యాంపు కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి సోమవారం(ఆగస్టు 9) సమీక్ష సమావేశం నిర్వహించారు.

లబ్దిదారుల ఎంపికపై చర్చించిన మంత్రి

లబ్దిదారుల ఎంపికపై చర్చించిన మంత్రి

ఆసరా వృద్దాప్య పింఛన్ల లబ్దిదారుల కనీస వయసును రాష్ట్ర ప్రభుత్వం 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన లబ్దిదారుల జాబితాను వెంటనే సిద్ధం చేసి ఫించన్లు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వయోపరిమితి తగ్గింపు నేపథ్యంలో లబ్దిదారుల ఎంపిక విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి మూడు రోజుల్లోగా ఫించన్లు మంజూరు చేసేలా ఆదేశాలిచ్చారు. అర్హుల ఎంపిక పారదర్శకంగా జరగాలన్నారు.

వారికి వెంటనే ప్రమోషన్లు...

వారికి వెంటనే ప్రమోషన్లు...

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగులు, అధికారులకు వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉద్యోగాల ఖాళీల భర్తీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నారు.ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా హరితహారం పథకం కింద నాటిన మొక్కలు వంద శాతం బతికేలా ప్రత్యేక చర్యలను చేపట్టాలని అదేశించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను ఎప్పటికప్పుడు సోషల్ ఆడిటింగ్ చేసి నిధులు సద్వినియోగం అయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు.

ఆ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని...

ఆ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని...

సోషల్ ఆడిట్ పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని, విలేజ్ రిసోర్స్ పర్సన్స్ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో ఇంజినీరింగ్ అధికారుల సీనియారిటీ, ఇతర సమస్యలను పరిష్కరించి వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని అదేశించారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి శాశ్వత పరిష్కారానికి అవసరమయ్యే చర్యలపై నివేదిక సమర్పించాలన్నారు.

ఆదివాసీలపై మంత్రి ఎర్రబెల్లి...

ఆదివాసీలపై మంత్రి ఎర్రబెల్లి...

నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీలకు మంత్రి ఎర్రబెల్లి శుభాకాంక్షలు తెలిపారు.ఆదివాసీల అభ్యున్న‌తికి తెలంగాణ‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.ఆదివాసుల‌కు అన్ని మౌళిక వసతులు కల్పించదానికి ప్ర‌భుత్వం కోట్లాది రూపాయాల‌ నిధులు ఖర్చు చేస్తుంద‌ని వెల్ల‌డించారు.అటవీ హక్కుల చట్టం అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని.. అటవీ ఉత్పత్తులపై ఆధారపడ్డ అడవి బిడ్డల స్వావలంబన దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు. గిరిజన విద్యాభివృద్ధి కోసం రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను ప్రారంభించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు.

ఆదివాసీల కోసం ప్రభుత్వం చేస్తున్నవి...

ఆదివాసీల కోసం ప్రభుత్వం చేస్తున్నవి...

దక్షిణ భారత కుంభమేళాగా చెప్పుకునే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను తమ ప్రభుత్వం ప్రపంచానికి తెలంగాణ ఉనికి చాటేలా అత్యంత వైభవంగా నిర్వహిస్తోందన్నారు. ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీకైన కుమ్రం భీం వ‌ర్ధంతిని అధికారికంగా నిర్వహించడంతో పాటు జోడేఘాట్ అభివృద్దికి రూ.25 కోట్లు, నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణం కోసం రూ. 7 కోట్ల నిధులు కేటాయించింద‌న్నారు.
కేస్లాపూర్‌లోని నాగోబా జాతర ఉత్సవాలకు ప్రతి ఏటా ప్ర‌భుత్వ‌మే నిధులు మంజూరు చేస్తోందని పేర్కొన్నారు. నాగోబా ఆల‌య విస్త‌ర‌ణ‌, ద‌ర్భార్ నిర్మాణం, రోడ్ల అభివృద్దికి నిధులు కేటాయించింద‌ని పేర్కొన్నారు. ఇక మైదాన గిరిజనుల కోసం ప్రత్యేకించి ప్రతి తండానూ గ్రామ పంచాయతీగా గుర్తించి 'మా తాండాలో మా రాజ్యం' అనే గిరిజన ప్రజల కలను సాకారం చేసిందని అన్నారు.సీఎం కేసిఆర్ సబ్బండ వ‌ర్గాల ప్రజల సంక్షేమ,అభివృద్దికి అనేక కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నారని పేర్కొన్నారు.

ఆసరా ఫించన్లు...

ఆసరా ఫించన్లు...

తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ఆసరా పథకం ద్వారా రాష్ట్రంలోని వృద్దులు,వితంతువులు,ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, బోధకాల వ్యాధిగ్రస్తులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ప్రతీ నెల రూ.2,116,ఫించన్లు,దివ్యాంగులకు రూ.3116 ఫించన్లు అందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో ఆసరా పింఛన్ల సంఖ్య 37,86,20 కాగా.. ఇందులో వృద్ధాప్య పింఛన్లు 11,76,743. ఇప్పటివరకూ 65 ఏళ్లు పైబడిన వృద్ధులకే ఆసరా ఫించన్లు ఇచ్చారు. ప్రభుత్వం తాజాగా ఆ వయోపరిమితిని 57 ఏళ్లకు తగ్గించడంతో లబ్దిదారుల సంఖ్య పెరగనుంది.

హుజురాబాద్‌లో చకచకా...

హుజురాబాద్‌లో చకచకా...

హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ,కొత్త ఫించన్ల లబ్దిదారుల ఎంపికను చకచకా కానిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పింఛన్లు, రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించాలని ఉన్నతాధికారులు మండల స్థాయి అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో ఎక్కడా జాప్యం చేయకుండా అధికారులు చకచకా చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా సైట్ ఓపెన్ కాకపోయినా.. ప్రత్యేకించి ఒక్క హుజురాబాద్ నియోజకవర్గంలోనే రేషన్​కార్డులకు దరఖాస్తులు తీసుకోవడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉపఎన్నిక కోసమే ప్రభుత్వం ఈ జిమ్మిక్కులు చేస్తోందని విమర్శిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+