చర్లపల్లి రైల్వే స్టేషన్ సిద్దం, కళ్లు చెదిరేలా - 25 రైళ్లు ఇక్కడ నుంచే..!!

అధునాతన హంగులతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టర్మినల్ ప్రారంభానికి సిద్దమంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూ.430 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ టెర్మినల్‌ ను ఈ నెల 28న రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించనున్నారు. అదే రోజు నుంచి ప్రయాణీకులకు అందుబాటులో కి రానుంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడపై భారం తగ్గించేలా చర్లపల్లి నుంచి 25 ప్రధాన రైళ్లు ఇక్కడి నుంచే రాకపోకలు సాగించేలా నిర్ణయించారు.

అంతర్జాతీయ విమానాశ్రయ హంగులతో చర్లపల్లి రైల్వే టర్మినల్ ప్రయాణీకులకు అందుబాటులో కి వస్తోంది. హైదరాబాద్ - సికింద్రాబాద్ రైల్వే లో చర్లపల్లి రైల్వే స్టేషన్ అద్బుతమైన టర్మినల్ గా ఆవిష్కారం జరగనుంది. ఈ టర్మినల్ లో ప్రయాణీకుల కోసం ఆధునిక సౌకర్యాలను అందుబాటు లోకి తీసుకొచ్చారు. ఆరు ఎస్కలేటర్లు, ఏడు లిఫ్ట్‌లు, ఆరు బుకింగ్‌ కౌంటర్లు, పురుష- మహిళా ప్రయాణీకుల కోసం వేర్వేరు వెయిటింగ్‌ హాళ్లు రూపొందించారు. అదే విధంగా హైక్లాస్‌ వెయిటింగ్‌ ఏరియా ఏర్పాటు చేసారు. విమానాశ్రయాల తరహాలో ఎగ్జిక్యూటివ్ లాంజ్ లు సిద్దం చేసారు. తొలి అంతస్తులో కెఫెటేరియా .. రెస్టారెంట్ వంటి సౌకర్యాలను కల్పించారు.

Ashwini Vaishnaw to launch the prestigious Charlapalli Railway Terminal on December 28

ప్రయాణీకులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అధునిక సాంకేతికత వినియోగించి కొత్త డిజైన్లలో ప్రకాశవంతమైన లైటింగ్‌తో ఎలివేషన్‌ తీర్చిదిద్దారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచికూడ రైల్వే స్టేషన్‌లపై ప్రయాణికుల ఒత్తిడి తగ్గనుంది. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లకు అదనంగా మరో 25 జతల ట్రైన్స్​ చర్లపల్లి నుంచి రాకపోకలు సాగించేలా షెడ్యూల్ ఖరారు చేసారు. చర్లపల్లికి ప్రయాణీకుల రాకపోకల కోసం కుషాయిగూడ, చంగిచర్ల డిపో ల నుంచి నిరంతరం బస్సులు నడిపేలా కసరత్తు జరుగుతోంది.

ఈ స్టేషన్ నిర్మాణం కోసం రూ 430 కోట్లు ఖర్చు చేసారు. 38 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ స్టేషన్ లో మొత్తం 9 ప్లాట్ ఫారం లు ఏర్పాటు చేసారు. రెండు ఎంఎంటీఎస్ తో పాటుగా 25 రైళ్ల రాకపోకలు ఇక్కడి నుంచే జరిగేలా షెడ్యూల్ ప్రకటించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+