కేసీఆర్ వ్యాఖ్యలకు అసోం సీఎం కౌంటర్ : వాటిపై మాట్లాడరా - అలాంటి వ్యక్తులపై మాట్లాడకూడదా..!!
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ పైన అసోం సీఎం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా పొలిటికల్ హీట్‌ను పెంచాయి. ఆయన చేసిన వ్యాఖ్యల పైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ అయ్యారు. భువనగిరిలో జరిగిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఇదేనా బీజేపీ సంస్కారం అని ప్రశ్నించారు. అసోం సీఎం వ్యాఖ్యల పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. బీజేపీ అగ్రనేతలు తమ పార్టీ నేతలకు ఇదే నేర్పుతున్నారా అంటూ ఫైర్ అయ్యారు. అసోం సీఎంను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కేసీఆర్ డిమాండ్ చేసారు. ఇదేనా ధర్మం, హిందూత్వం అంటూ మండిపడ్డారు.

కేసీఆర్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా
ఆ తరువాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు రియాక్ట్ అయ్యారు. పలు చోట్ల నిరసనలకు దిగారు. అసోం సీఎంను బర్తరఫ్ చేయాంటూ డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేసారు. కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన తరువాత కాంగ్రెస్ నేతలు దీనిని అందుకున్నారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు...ఆయన్ను బర్తరఫ్ చేయాలనే డిమాండ్ తో ఒక్క సారిగా దీని పైన జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ..అసోం సీఎం వ్యాఖ్యలను పలువురు తప్పు బట్టట్టంతో ఆయన దీని పైన స్పందించారు. సీఎం బిస్వాశర్మ తన పైన కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు స్పందించారు.

స్పందించిన అసోం సీఎం
సర్జికల్ స్ట్రయిక్‌పై రాహుల్ ఆధారాలు అడిగారు.. బిపిన్ రావత్‌పై వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్ గాంధీ పైన మరోసారి బిస్వా శర్మ వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తులపై మాట్లాడకుడదా అంటూ ప్రశ్నించారు. గాంధీ కుటుంబం పైన విమర్శలు చేయకూడదా అంటూ నిలదీసారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తాను మాట్లాడిందే తప్పుగా అనిపించిందా అంటూ వ్యాఖ్యానించారు. మన సైన్యంపై గాంధీ మాట్లాడిన అంశంపై కేసీఆర్ ఎందుకు స్పందించలేదని అడిగారు. గాంధీ కుటుంబాన్ని విమర్శించకూడదన్న ఈ ఆలోచనా ధోరణి మారాలి అంటూ అసోం సీఎం హిమంత బిస్వా శర్మ పేర్కొన్నారు. బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యల పైన రోడ్ల పైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ శ్రేణులు ..ఆయన స్టేషన్లలోనూ ఫిర్యాదులు చేస్తున్నారు.
Recommended Video

రాహుల్ కు మద్దతుగా...
ఇక, కేసీఆర్ ఇప్పుడు ప్రధాని మోదీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దేశం నుంచి తరిమి కొడతామంటూ హెచ్చరిస్తున్నారు. జాతీయ స్థాయిలో పాలనలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ ఆరోపిస్తున్నారు. అనేక అంశాలను ప్రస్తావిస్తున్నారు. నీరు - విద్యుత్ వినియోగంలో ఏ మాత్రం అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇటువంటి పాలన అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. తాను దేశం కోసం పని చేస్తానని చెబుతూనే... ఇందుకు ప్రజల మద్దతు కోరే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా సమయంలో ప్రధాని నిర్ణయాల కారణంగా భారీగా నష్టం జరిగిందంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇక, అసోం సీఎం వ్యాఖ్యలను ప్రస్తావించటం ద్వారా..జాతీయ స్థాయిలో ఇప్పుడు కేసీఆర్ డిమాండ్ కు బీజేపీ వ్యతిరేక శ్రేణుల నుంచి మద్దతు లభిస్తోంది. పలువురు అసోం సీఎంను బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications