హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

48 ఏళ్ళ వయసులో.. తలైమన్నార్ నుండి ధనుష్కోడికి 30కిలోమీటర్ల మేర సముద్రాన్ని ఈదిన తొలి తెలుగు మహిళ

|
Google Oneindia TeluguNews

మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ. 48 ఏళ్ల వయసులో 30 కిలోమీటర్ల మేర సముద్రాన్ని ఈది సంసార సాగరాన్ని ఈదుతున్న మాకు సముద్రం ఒక లెక్కా అంటూ తేల్చిపారేశారు..

Recommended Video

#SyamalaGoli : First Telugu Woman & Second in the World.. 48 ఏళ్ళ వయసులో సముద్రాన్ని ఈదిన తొలి మహిళ

ఎన్డీఆర్ఎఫ్ లో మహిళలు .. విపత్తులపై పోరాటం, విధుల్లో 100 మందితో కూడిన మొదటి దళంఎన్డీఆర్ఎఫ్ లో మహిళలు .. విపత్తులపై పోరాటం, విధుల్లో 100 మందితో కూడిన మొదటి దళం

30 కిలోమీటర్ల మేర శ్రీలంక నుండి భారతదేశానికి మధ్య జలసంధిలో ఈదిన మహిళ

30 కిలోమీటర్ల మేర శ్రీలంక నుండి భారతదేశానికి మధ్య జలసంధిలో ఈదిన మహిళ

హైదరాబాద్ కు చెందిన 48 ఏళ్ల జి శ్యామల అనే మహిళ 30 కిలోమీటర్ల మేర శ్రీలంక నుండి భారతదేశానికి మధ్య ఉన్న జలసంధిలో ఈది చరిత్ర సృష్టించారు. సముద్రంలో 30 కిలోమీటర్ల దూరం ఈత కొట్టిన తొలి తెలుగు మహిళగా ఆమె రికార్డు సృష్టించడమే కాకుండా ప్రపంచంలో సముద్రాన్ని ఈ మేరకు ఈదిన రెండవ మహిళగా నిలిచారు. శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల 15 నిమిషాలకు శ్రీలంక తీరం నుండి ప్రారంభమైన శ్యామల 13 గంటల నలభై మూడు నిమిషాల పాటు నిరంతరంగా ఈతకొట్టి రామేశ్వరంలోని ధనుష్కోడికి చేరుకున్నారు.

 శ్రీలంకలో ఉన్న తలైమన్నార్ నుండి ధనుష్కోడి వరకు 13 గంటల 40 నిమిషాల ఈత

శ్రీలంకలో ఉన్న తలైమన్నార్ నుండి ధనుష్కోడి వరకు 13 గంటల 40 నిమిషాల ఈత

శ్రీలంకలో ఉన్న తలైమన్నార్ నుండి ధనుష్కోడి సమీపంలోని అరిచల్మునై వరకు 13 గంటల 40 నిమిషాల్లో ఈది ఈత లోనూ మహిళలు తమకు తామే సాటి అని నిరూపించారు. తీరానికి చేరుకున్న ఆమె విలేకరులతో మాట్లాడుతూ, చాలామంది విదేశాలలో ఈత కొట్టినప్పటికీ, తాను భారతదేశంలో చేయాలనుకున్నానని , అందువల్ల తాను రామ్-సేతును ఎంచుకున్నానని చెప్పారు . సీనియర్ ఐపిఎస్ అధికారి రాజేష్ త్రివేది ఏడాది క్రితం తాను చేయదలచుకున్న ప్రయత్నాన్ని ప్రోత్సహించారని , గత నాలుగు సంవత్సరాలుగా తాను శిక్షణ తీసుకుంటున్నానని శ్యామల తెలిపారు.

 తనకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపిన తెలంగాణా మహిళ శ్యామల

తనకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపిన తెలంగాణా మహిళ శ్యామల

గత సంవత్సరం, తాను శ్రీలంక వెళ్లి అక్కడ నుండి ఈదడానికి ప్రయత్నించాను కాని కోవిడ్ -19 కారణంగా, తాను తన ప్రయాణాన్ని రద్దు చేయాల్సి వచ్చిందన్నారు . మళ్ళీ, నేను ఈ సంవత్సరం కచ్చితంగా జలసంధిలో ఈదాలి నిర్ణయించుకుని ప్రయత్నం చేశానని, తనకు ఎంతగానో సహకరించిన భారత హై కమిషన్ మరియు శ్రీలంక ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. హైకమిషన్ ఉన్నతాధికారి కెప్టెన్ వికాస్ సూద్ అనుమతి పొందడంలో తనకు చాలా సహాయపడ్డారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు .

మొట్టమొదటి తెలుగు మహిళ , ప్రపంచంలో రెండో మహిళగా స్థానం

మొట్టమొదటి తెలుగు మహిళ , ప్రపంచంలో రెండో మహిళగా స్థానం

2012లో 12 గంటల 30 నిమిషాల్లోనే ఇదే జలసంధిని త్రివేది దాటారు. ఇప్పుడు మరోమారు ఈ జలసంధిని దాటిన మొట్టమొదటి తెలుగు మహిళగా గోలి శ్యామల నిలిచారు.
మహిళలు అన్ని రంగాల్లోనూ సత్తా చాటగలరని ఇప్పటికే అనేకరంగాలలో ప్రతిభ చూపిస్తున్న మహిళలు అందరికీ అర్ధమయ్యేలా చెప్తున్నారు. తాజాగా సముద్రాన్నే ఈదిన మహిళ కూడా మహిళల వజ్ర సంకల్పాన్ని , ఏదైనా సాధించే మగువల పట్టుదలను , లక్ష్యాలను చేదించటంలో ఆమె చూపించే సాహసాన్ని మరోమారు చూపించింది . సముద్రాన్ని నిరంతరాయంగా ఈదిన మొట్టమొదటి తెలుగు మహిళ గా , ప్రపంచంలో రెండో మహిళగా స్థానం సంపాదించుకుంది .

English summary
Shyamala Goli, 48, of Telangana, swam in 13 hours and 40 minutes from Talaimannar in Sri Lanka to Arichalmunai near Dhanushkodi on Friday. On reaching the shores, she told reporters that though many had swam in other countries, I wanted to do it in India so that I chose the Ram-Setu. Rajesh Trivedi, a senior IPS officer, encouraged me to do it a year ago. I have been swimming for the last four years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X