హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షబ్బీర్, ఉత్తమ్‌లపై దాడి: పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన అసదుద్దీన్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో పాతబస్తీలో కాంగ్రెస్ పార్టీ నేతల పైన దాడి కేసులో మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ సోమవారం నాడు పోలీసుల ఎదుట లొంగిపోయారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఈ నెల 2వ తేదీన జరిగాయి. చివరి నిమిషంలో పాతబస్తీలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. అసదుద్దీన్‌తో పాటు పదిహేను మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Attack on Shabbir Ali, Uttam Kumar Reddy: Asad to Police Stations

గ్రేటర్ ఎన్నికల సమయంలో మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ విపక్ష నేత షబ్బీర్ అలీల పైన దాడి జరిగింది. ఈ దాడి కేసులో అసదుద్దీన్ సోమవారం పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.

అసదుద్దీన్‌కు బెయిల్

ఉత్తమ్, షబ్బీర్ అలీల పైన దాడి కేసులో పోలీసుల ఎదుట లొంగిపోయిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి బెయిలు మంజూరైంది. హైదరాబాద్ నాంపల్లిలోని 8వ మెట్రోపాలిటన్ కోర్టు బెయిలు మంజూరు చేసింది. అసద్ ఉదయం సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఎదుట లొంగిపోయారు.

English summary
Attack on Shabbir Ali, Uttam Kumar Reddy: Asad to Police Stations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X