ప్రతిఘటనకు కేరాఫ్ వరంగల్; చిరంజీవి నుండి వైఎస్ షర్మిల వరకు దాడులపై ఆసక్తికర చర్చ!!
పోరాటాల పురిటిగడ్డ, ఉద్యమాల ప్రయోగశాల, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన వరంగల్ పేరు అప్పటినుండి ఇప్పటివరకు అనేక సందర్భాలలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా వైయస్ షర్మిల పాదయాత్ర నేపథ్యంలో చోటు చేసుకున్న దాడి ఘటన, ఆపై ఆమె అరెస్టుతో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న చర్చ నేపథ్యంలో వరంగల్ పేరు మరోమారు చర్చనీయాంశంగా మారింది.

వరంగల్ వేదికగా ధిక్కార స్వరం.. కీలక నాయకులకు చేదు అనుభవం
రాష్ట్రమంతా పాదయాత్రలు చేయడం, సభలు సమావేశాలు పెట్టడం ఒక ఎత్తైతే.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాదయాత్రలు చేయడం, సభలు, సమావేశాలు పెట్టడం ఒక ఎత్తు అన్న భావన రాష్ట్ర వ్యాప్తంగా అందరిలోనూ వ్యక్తమవుతోంది. రాజకీయాలలో గతంలో చిరంజీవి నాటి నుండి చూసుకుంటే, వైయస్ జగన్మోహన్ రెడ్డి, బండి సంజయ్, ప్రస్తుతం వైయస్ షర్మిల వరకు ప్రతి ఒక్కరికి వరంగల్ నగరంలో ధిక్కార స్వరమే వినిపించింది. ప్రతిఘటనే కనిపించింది. వరంగల్ జిల్లాలో వివిధ సందర్భాల్లో జరిగిన దాడులు ప్రస్తుతం వైయస్ షర్మిల అరెస్టు ఘటనతో మరోమారు చర్చనీయాంశంగా మారింది.

వైఎస్ షర్మిలకు నర్సంపేటలో షాక్.. దాడి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రస్థానం పాదయాత్ర పేరుతో పాదయాత్ర కొనసాగిస్తున్న వైయస్ షర్మిల పాదయాత్రలో స్థానిక ఎమ్మెల్యే లను టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేయడం, వారిపై అవినీతి ఆరోపణలు చేయడం, అక్రమంగా సంపాదించారంటూ విరుచుకుపడడం వంటి వరుస ఘటనలతో, వైయస్ షర్మిల పై తిరుగుబాటు ప్రకటించారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు. అయితే ఆ తిరుగుబాటుకువరంగల్ జిల్లా నర్సంపేట వేదిక అయింది. పాదయాత్ర చేస్తున్న వైయస్ షర్మిల నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలతో ఆమె రాత్రి బస చేసే వాహనాన్ని తగలబెట్టడం తోపాటు,రాళ్ల దాడి చేశారు.

షర్మిల పై దాడి నుండి అరెస్ట్ వరకు.. వరంగల్ జిల్లానే కీలకం
దీంతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, షర్మిల పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు ఆమెను తిరిగి బంజార హిల్స్ లోని తన ఇంటికి చేర్చారు.పాదయాత్ర చేస్తున్న తనపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి,పాదయాత్ర సజావుగా జరిగేలాచూడకుండా తనని ఇబ్బంది పెట్టిన పోలీసుల తీరుకు వ్యతిరేకంగా ఆమె ప్రగతిభవన్ ను ముట్టడించాలని నిర్ణయించారు.దీంతో వైయస్ షర్మిల ను అడ్డుకున్న పోలీసులు కారుతో సహా ఆమెనుక్రేన్ సహాయంతో పోలీస్ స్టేషన్ కుతీసుకు వెళ్లి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు.నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా,వ్యక్తిగత పూచీకత్తుపైనా వైయస్ షర్మిలకు ఆపై బెయిల్ మంజూరు అయింది.ఈ మొత్తం ఎపిసోడ్ కు వరంగల్ జిల్లానే నాంది పలికింది.

బండి సంజయ్ పాదయాత్ర సమయంలోనూ దాడి.. ఉద్రిక్తత
ఇక ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టిన బండి సంజయ్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సమయంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. జనగామ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో టిఆర్ఎస్, బిజెపి కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా, అది కర్రలతో కొట్టుకునే స్థాయి దాకా వెళ్ళింది. దీంతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిందని పోలీసులు బండి సంజయ్ ను అరెస్ట్ చేయడం, ఆపై పాదయాత్ర ఆపేయాలని నోటీసులు జారీ చేయడం, బండి సంజయ్ హైకోర్టుకు వెళ్లి మళ్లీ పాదయాత్ర కొనసాగించడానికే అనుమతిని తెచ్చుకోవడం జరిగింది. బండి సంజయ్ పాదయాత్ర సమయంలో దాడి ఘటనకు ఉమ్మడి వరంగల్ జిల్లానే వేదిక అయింది.

వైఎస్ జగన్ కూ చేదు అనుభవం... మానుకోట రాళ్ళ దాడి చారిత్రాత్మకం
గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ మరణం అనంతరం అభిమానులను ఓదార్చడానికి చేపట్టిన ఓదార్పు యాత్ర వరంగల్ జిల్లాలో ఉద్రిక్తతలకు కారణమైంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి మానుకోటలో ఓదార్పు యాత్రను నిర్వహించాలని నిర్ణయించుకుని అక్కడికి రావాలని ప్రయత్నించిన క్రమంలో జగన్ గో బ్యాక్ అంటూ మానుకోట రైల్వే స్టేషన్ సాక్షిగా జరిగిన రాళ్లదాడి దేశవ్యాప్త చరిత్రలో నిలిచిపోయింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో సాగిన మానుకోట రాళ్లదాడి వైయస్ జగన్ ను మానుకోటకు రాకుండా చేసింది.

చిరంజీవిపైనా కోడిగుడ్ల దాడి.. ప్రతిఘటనకు కేరాఫ్ వరంగల్
అంతకుముందు 2008లో ప్రజారాజ్యం పార్టీతో మెగాస్టార్ చిరంజీవి ప్రజాక్షేత్రంలోకి వెళ్లి రోడ్ షో చేస్తున్న క్రమంలో వరంగల్లో ఆయన ప్రజల ఆగ్రహాన్ని చవిచూశారు. నర్సంపేటలో చిరంజీవి రోడ్ షో లో చిరంజీవి ప్రసంగిస్తున్న సమయంలో, ప్రత్యేక తెలంగాణపై తన స్పష్టమైన వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేస్తూ కొందరు ఆయనపై కోడిగుడ్లు విసిరారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంగానే చిరంజీవికి చేదు అనుభవం ఎదురైంది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన వరుస ఘటనలను తాజాగా వైయస్ షర్మిల పై జరిగిన దాడి ఘటనతో ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఓరుగల్లు వేదికగా సాగుతున్న ప్రతిఘటన ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.
-
2007లో సినీ వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి-మోహన్‌బాబు మాటల యుద్ధం -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications