హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాపైనే కాదు, రైతులపైనా దాడులు: బండి సంజయ్ ఫైర్, కేసీఆర్ డైరెక్షన్, డీజీపీ ఫోన్ ఎత్తరు!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్‍‌లోనే తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. రైతులు తమ బాధలు చెప్పుకోకుండా టీఆర్ఎస్ వాళ్లు రాళ్లు వేశారన్నారు బండి సంజయ్. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు.

రైతులపైనా టీఆర్ఎస్ నేతలు దాడులు: బండి సంజయ్

రైతులపైనా టీఆర్ఎస్ నేతలు దాడులు: బండి సంజయ్

రైతులు తమ బాధలు చెప్పుకుంటున్నారని తెలిపారు బండి సంజయ్. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. రైతుల మీద దాడి చేసింది టీఆర్ఎస్ నేతలేనన్నారు. ధాన్యం కొనాలని జిల్లాల్లో రైతులు ధర్నా చేస్తున్నారన్నారు బండి సంజయ్. టీఆర్ఎస్ నేతలే కాకుండా, కిరాయి గుండాలకు డబ్బులిచ్చి దాడులు చేయిస్తున్నారన్నారని బండి సంజయ్ మండిపడ్డారు. వానాకాలం పంటపై ఎఫ్‌సీఐతో అగ్రిమెంట్ చేసుకున్నారా? లేదా ప్రభుత్వం చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. బీజేపీ కార్యకర్తలు టార్గెట్‌గా పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారన్నారు. బీజేపీ నేతలతో మాట్లాడే రైతులపై దాడులు చేస్తున్నారన్నారు బండి సంజయ్. తమతోపాటు రైతులపైనా టీఆర్ఎస్ గూండాలు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడేమో దొంగేదొంగా అన్నట్టుగా టీఆర్ఎస్ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఇది అఫ్ఘానిస్తానా...? పాకిస్తాన్..? అని అన్నారు.

కేసీఆర్ డైరెక్షన్లోనే దాడులు, డీజీపీ ఫోన్ ఎత్తరంటూ బండి సంజయ్

కేసీఆర్ డైరెక్షన్లోనే దాడులు, డీజీపీ ఫోన్ ఎత్తరంటూ బండి సంజయ్

వారం రోజులుగా తాను, బీజేపీ ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే డీజీపీ ఫోన్ ఎత్తడం లేదన్నారు. తమపై దాడులు చేయాలని డైరెక్ట్ ముఖ్యమంత్రే డైరక్షన్ ఇచ్చారన్నారు. పోలీసులు ఉండగానే తమపై దాడులు చేశారన్నారు. 'వానాకాలం వడ్ల కొనుగోలు విషయంలో రైతుల పక్షాన టిఆర్ఎస్ మూకలతో వీరోచిత పోరాటం చేసిన బీజేపీ కార్యకర్తలను అభినందిస్తున్నాను. పోలీసుల చాటున ఉండి టిఆర్ఎస్ నాయకులు రాళ్లు రువ్వినా, దాడి చేసినా, వెన్ను చూపని కర్యకర్తల ధైర్య సాహసాలకు హ్యాట్సాఫ్. ఈ ఘటనలో చాలా మంది బిజెపి కార్యకర్తలు గాయపడ్డారు. ఇక ముందు కూడా బిజెపి కార్యకర్తలు ఇదే తెగువను చూపి రైతులకు అండగా ఉండాలి. టిఆర్ఎస్ గుండాల దాడిలో మీడియా మిత్రులు, కొందరు పోలీసులు కూడా గాయపడటం బాధ కలిగించింది' అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

Recommended Video

Sanjay Bangar named head coach of Royal Challengers Bangalore
కేసీఆర్‌కు ప్రజలు సరైన గౌరవమే ఇస్తారంటూ విజయశాంతి ఫైర్

కేసీఆర్‌కు ప్రజలు సరైన గౌరవమే ఇస్తారంటూ విజయశాంతి ఫైర్

'ఎన్నికలప్పుడు హామీలు గుప్పించడానికి.... ఘోర పరాభవాలు జరిగినప్పుడు విపక్షాలపై విమర్శలతో విరుచుకుపడటానికి మాత్రమే ప్రజల్లో కనిపించే తెలంగాణ సీఎం కేసీఆర్ సెక్రెటేరియట్‌లో దర్శనం ఇవ్వడం ఎప్పుడో మానేశారు. ఆయన రాకపోతే పోయారు... తమ బాధలు చెప్పుకోవడానికి రాజధానిలోని సెక్రెటేరియట్‌కి వచ్చే ప్రజల గోడు సైతం కనీసం మంత్రులు, లేదా ఉన్నతాధికారులకైనా చేరకుండా అడ్డుకుంటున్నారు. ఈ తతంగం గత ఏడాది కాలానికి పైగా కొనసాగుతూ వస్తోంది. ఏదో ఉద్ధరించేస్తామంటూ పాత సెక్రెటేరియట్‌ని కూల్చివేయించి... ఆ పక్కనే ఉన్న బీఆర్కే భవన్‌లో తాత్కాలికంగా సెక్రెటేరియట్ ఏర్పాటు చేసిన తెలంగాణ సర్కారు.... ప్రజల్ని మాత్రం ఆమడదూరంలో ఉంచి ఆ చాయలకే రాకుండా అడ్డుకుంటోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఎన్నో ముఖ్యమైన పనుల కోసం డబ్బు ఖర్చు చేసి, కష్టపడి హైదరాబాదులోని సెక్రెటేరియట్‌కి వస్తున్న ప్రజల్ని ఇప్పటికీ కరోనా పేరుతో ఆపేస్తుండటం దారుణం. ఆఫీసులు, సినిమా హాళ్ళు, స్కూళ్ళు ఇంకా అనేక పబ్లిక్ ప్లేసులన్నిటినీ బార్లా తెలిచిన సర్కారు.... తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన జనాన్ని మాత్రం కరోనా పేరుతో అడ్డుకోవడం విడ్డూరం. సామాన్యులే కాదు.... ఆగిపోయిన ప్రభుత్వ పనుల బిల్లుల క్లియరెన్స్ కోసం వచ్చేవారికి... వివిధ సంఘాలు, పార్టీల వారు... ఎవరైనప్పటికీ ఏ సమస్య పైనయినా రిప్రజెంటేషన్ ఇద్దామన్నా దిక్కులేని దుస్థితి నెలకొంది. ఇంకా దారుణం ఏమంటే.... సెక్రెటేరియట్‌లోని హెచ్ఓడీలకు ముఖ్యమైన ఫైల్స్ ఇవ్వడానికి నగరంలోని ఇతర ప్రభుత్వ శాఖల నుంచి వచ్చే కింది స్థాయి ఆఫీసర్లకు.... రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం వచ్చే రిటైర్డ్ ఉద్యోగులకు కూడా బీఆర్కేలో చుక్కలు చూపిస్తున్నారు. తెలంగాణ సర్కారు తన ప్రజలకు ఇస్తున్న ఈ గౌరవ మర్యాదలను... రాబోయే ఎన్నికల్లో సర్కారుకు తిరిగిచ్చేందుకు ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు' అంటూ కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి.

English summary
Attacks on BJP leaders: Bandi Sanjay and Vijayashanthi slams CM KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X