గాలిలో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు: నలుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో ఘోర హెలికాప్టర్ల ప్రమాదం చోటు చేసుకుంది. గాలిలోనే రెండు హెలికాప్టర్లు ఢీకొనడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వీరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
పర్యాటక ప్రదేశమైన బీచ్ సమీపంలో ఒక హెలికాప్టర్ ల్యాండింగ్ అవుతుండగా.. మరొకటి గాలిలోకి ఎగురుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని క్వీన్స్‌లాండ్ అధికారులు తెలిపారు. ఆస్ట్రేలియా క్వీన్స్ లాండ్ లోని పర్యాటక ప్రదేశమైన గోల్డ్‌కోస్ట్‌లో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగిందని చెప్పారు.

సీ వరల్డ్ థీమ్ పార్కు బీచ్‌లో ఓ హెలికాప్టర్ ల్యాండ్ అవుతోన్న క్రమంలోనే.. మరొకటి టేకాఫ్ అవుతోంది. ఆ సమయంలోనే రెండు హెలికాప్టర్లు ఒకదాన్ని మరోటి ఢీకొనడంతో రెండు కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు.
ప్రమాదంలో ఓ హెలికాప్టర్ పూర్తిగా దెబ్బతినగా.. మరో హెలికాప్టర్ పాక్షికంగా దెబ్బతింది. ప్రమాద ఘటనపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications