మరిదితో సంబంధం: భర్తను కడతేర్చింది (ఫోటో)

హైదరాబాద్: ఆటో డ్రైవర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నేరేడ్‌మెట్ పోలీసు స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసులు వివరాలు తెలిపారు. అడ్డగుడ్డ వడ్డెరబస్తీలో ఉండే మహేష్ (32), ఎల్లమ్మ (29) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు.

మహేష్ రోజు మద్యం సేవించి భార్యను వేధించేవాడు. ఆమె చెల్లెలి భర్త సత్యనారాయణ ఆర్కేపురంలో నివాసం ఉంటూ కల్లు కంపౌండులో పని చేసేవాడు. ఎల్లమ్మకు అతడితో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో ఎలాగైన భర్తను వదిలించుకోవాలని చూసింది.

Auto driver killed by wife in hyderabad!

ఈ నెల 11వ తేదీన యాదగిరిగుట్టలో వారి బంధువుల శుభకార్యానికి మహేష్ తల్లి, సోదరుడు, సోదరి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన ఎల్లమ్మ తన భర్తను హతమార్చాలని సత్యనారాయణకు చెప్పింది. మహేష్‌ను సత్యనారాయణ ఆనంద్ బాగ్‌కు తీసుకు వెళ్లి మద్యం సేవించారు.

ఆ తర్వాత ద్విచక్ర వాహనం పైన మహేష్‌ను అమ్ముగూడలోని క్వారీ వద్దకు తీసుకు వచ్చి బండరాయితో తలపై మోది హత్య చేశాడు. సోమవారం ఉదయం అమ్ముగూడ క్వారీ వద్ద మహేష్ మృతదేహం లభ్యమైందని సమాచారం అందుకున్న కుటుంబ సబ్యులు నేరేడ్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్యనారాయణ, ఎల్లమ్మలను విచారించగా, నేరాన్ని అంగీకరించారు. వారిని రిమాండుకు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+