ఉచిత బస్సులతో మా పొట్ట కొట్టొద్దు: ఆటో డ్రైవర్ల ఆందోళన!!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇప్పుడు రాష్ట్రంలో ఆందోళనలకు కారణంగా మారింది. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీలలో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చింది.

అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీని నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలకు ప్రయాణం ఉచితం చేసింది. దీంతో మహిళలు బస్సుల బాట పట్టారు. పెద్ద సంఖ్యలో బస్సులలోనే ప్రయాణం చేస్తూ తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఇక ఈ పరిణామాలు ఆటోవాలాల కడుపు కొడుతుందని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

auto drivers demand to stop free buses for women in telangana

నిన్నటికి నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆటో డ్రైవర్లు రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించడం వల్ల తమకు ఉపాధి పోయిందని వారు లబోదిబోమంటున్నారు. అప్పులు చేసి ఆటోలు కొనుక్కొని జీవనం సాగిస్తున్న తమకు అప్పుల భారం పెరిగి జీవితం మరింత దుర్భరంగా మారుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ నిర్ణయం తీసుకునే ముందు రవాణాపై ఆధారపడిన తమ వంటి వారి గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు. ఉచిత బస్సు పథకాన్ని వెంటనే రద్దు చేయాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాస్తారోకో నిర్వహించిన ఆటో డ్రైవర్లు ప్రభుత్వ వైఖరి పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

ఒక్క రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల ఆటో డ్రైవర్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత పరిణామాలు ఏమీ ఆలోచించకుండా తీసుకుంటుందని ఉచిత బస్సు ప్రయాణం కూడా అటువంటిదేనని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+