నమ్మించి బాలికను రేప్ చేశాడు, రోడ్డు ప్రమాదంలో టెక్కీ మృతి

హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని పదిహేను సంవత్సరాల బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతని పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగళవారం విలేకరుల సమావేశంలో పోలీసులు వివరాలు తెలిపారు.

తలాబ్ కట్ట అమాన్ నగర్, రహ్మానియా మదర్సా ప్రాంతానికి చెందిన జహంగీర్ తనయుడు మహ్మద్ షరీఫ్ ఆటో డ్రైవర్. అతడి పైన అఫ్జల్ గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో సెల్ ఫోన్ దొంగతనం కేసులు అయిదు, సుల్తాన్ బజార్లో ఆరు, మహంకాళీ, చాదర్ ఘాట్ పోలీసు స్టేషన్లలలో ఒక్కో కేసు, ఛత్రినాకలో ఆయుధాల చట్టం కింద కేసులు ఉన్నాయి.

ఇదిలా ఉండగా.. చార్మినార్ వద్ద ఆటో నడుపుతున్న షరీఫ్‌కు నగరానికి చెందిన ఓ బాలికతో పరిచయం ఏర్పడింది. ఆమెను తరుచు కలిసేవాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఈ నెల 19న గుల్బర్గా తీసుకెళ్లాడు. అక్కడ గది అద్దెకు తీసుకొని లైంగిక దాడికి పాల్పడ్డాడు.

Auto rickshaw driver rapes minor

21వ తేదీన నగరానికి వచ్చి చార్మినార్ వద్ద ఆమెను వదిలేశాడు. ఇంటికి వెళ్లిన బాలిక తన తల్లిదండ్రులకు షరీఫ్ విషయం చెప్పింది. ఆమె తల్లి హుస్సేనా ఆలం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతనిని పిస్తా హౌస్ చౌరస్తా వద్ద అరెస్టు చేశారు. రిమాండుకు తరలించారు.

రోడ్డు ప్రమాదంలో టెక్కీ మృతి

రోడ్డు ప్రమాదంలో సాఫ్టువేర్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన మొయినాబాద్ మండలంలోని రె్డిపల్లి - వీరన్నపేట గ్రామాల మధ్య సోమవారం రాత్రి జరిగింది. గౌలిగూడకు చెందిన నీలేష్ కుమార్ సాఫ్టువేర్ ఉద్యోగి. రెండున్నర నెలల క్రితమే స్వప్న అనే యువతితో వివాహం జరిగింది.

సోమవారం భార్యాభర్తలు శంకర్ పల్లి రిసార్టుకు వెళ్లారు. రాత్రి పది గంటల సమయంలో తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు. అతను రాత్రి పూట మూత్ర విసర్జన కోసమని కారు ఆపి దిగుతుండగా వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+