Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీటు దక్కినా విజయం వరించేనా - అజార్ పై విష్ణు గుగ్లీ..!!

తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తికర రాజకీయం చోటు చేసుకుంటోంది. అధికారం లక్ష్యంగా కంగ్రెస్ అభ్యర్దుల ఎంపిక చేసామని చెబుతోది. రెండో జాబితా ప్రకటన తరువాత అనూహ్య అంశాలు తెర మీదకు వస్తున్నాయి. సీటు ఆశించి దక్కని ఆశావాహులు పార్టీ వీడేందుకు సిద్దమవుతున్నారు. ఇదే సమయంలో జూబ్లీహిల్స్‌ అభ్యర్థిగా మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌, ఖైరతాబాద్‌ అభ్యర్థిగా పీజేఆర్‌ కుమార్తె పి.విజయారెడ్డికి అవకాశం కల్పించారు. ఇక్కడ ఇప్పుడు రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.

మారుతున్న లెక్కలు : కాంగ్రెస్ రెండో జాబితా ప్రకటనతో పలు నియోజకవర్గాల్లో లెక్కలు మారుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించింది. జూబ్లీహిల్స్‌ అభ్యర్థిగా మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌, ఖైరతాబాద్‌ అభ్యర్థిగా పీజేఆర్‌ కుమార్తె విజయారెడ్డికి అవకాశం కల్పించారు.

Azharuddin has been fielded from Jubilee Hills, PJR Son Vishnu resign for Congress

పీజేఆర్‌ కుటుంబంలో ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో అధిష్ఠానం తర్జన భర్జన పడింది. జూబ్లీహిల్స్‌ నుంచి పి.విష్ణువర్ధన్‌రెడ్డి, ఖైరతాబాద్‌ నుంచి పి.విజయారెడ్డి దివంగత నేత కుటుంబం నుంచి టికెట్‌ ఆశించారు. వీరిలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశంపై స్ర్కీనింగ్‌ కమిటీ పలుమార్లు బైఠాయించింది. చివరకు విజయారెడ్డి వైపే మొగ్గు చూపించింది.

జూబ్లీహిల్స్ లో అజారుద్దీన్ : ఖైరతాబాద్‌ నుంచి పి.విజయారెడ్డితోపాటు డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ సింగిరెడ్డి రోహిణ్‌రెడ్డి టికెట్‌ ఆశిస్తూ వచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కలగజేసుకొని రోహిణ్‌రెడ్డిని అంబర్‌పేట నుంచి పోటీ చేసేలా ఒప్పించారు. దీంతో విజయారెడ్డికి మార్గం సుగమమం అయింది. ఈ నిర్ణయంతో నియోజకవర్గంలో అసమ్మతికి కూడా చెక్‌ పెట్టినట్టు అయింది.

ఇక జూబ్లీహిల్స్‌ నుంచి పి.విష్ణువర్ధన్‌రెడ్డితోపాటు మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ పేరు పరిశీలనకు వచ్చింది. మొదట విష్ణుకే టికెట్‌ వస్తుందని అందరూ భావించారు. పార్టీ విషయంలో ఆయన నిర్లక్ష్య ధోరణిని అధిష్ఠానం సీరియ్‌సగా తీసుకుంది. పార్టీ కోసం పనిచేయని వారికి టికెట్‌ ఎలా ఇస్తారనే వాదనలు వెల్లువెత్తాయి. దీంతో విష్ణుకు చెక్‌ పెడుతూ అజారుద్దీన్‌ పేరును ఖరారు చేశారు. విష్ణుకు చెందిన ఓ సన్నిహిత వర్గం అజారుద్దీన్‌ వైపు మొగ్గు చూపించింది.

పెరుగుతున్న అసమ్మతి : విష్ణు నాయకత్వం వద్దంటూ అధిష్ఠానంను కలిసింది. అవన్నీ పరిగణలోకి తీసుకోవడంతోపాటు నియోజకవర్గంలోని మైనార్టీ ఓటర్లను దృష్టిలో పెట్టుకొని అధిష్ఠానం అజారుద్దీన్‌ పేరు ప్రకటించింది. దీంతో, ఇప్పుడు విష్ణు కాంగ్రెస్ వీడేందుకు సిద్దమయ్యారు. విష్ణు తన పేరు బ్యాలెట్ లో ఉంటుందని ఖచ్చితంగా చెబుతున్నారు.

దీని ద్వారా అవసరమైతే స్వతంత్ర అభ్యర్దిగా అయినా బరిలోకి దిగేందుకు సిద్దం అవుతున్నారనేది స్పష్టం అవుతోంది. ఇదే నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి బలమైన అభ్యర్ది బరిలో ఉన్నారు. ఈ పరిణామాలతో నియోజకవర్గంలో తలెత్తే అసమ్మతి విషయంలో పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. క్రికెట్ జీవితంలో వివాదాలు ఎదుర్కొన్న అజారుద్దీన్ తెలంగాణ పొలిటికల్ గ్రౌండ్ లో ఏ రకంగా సక్సెస్ అవుతారనేది చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+