చంద్రబాబుది ఒంటరి పోరాటం ..ఈసీ కేంద్రం చేతిలో కీలుబొమ్మ .. వీహెచ్ సంచలనం

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీ హనుమంతరావు చంద్రబాబుకు బాసటగా మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో చంద్రబాబు ఒంటరిగా పోరాటం చేస్తున్నారని విహెచ్ అన్నారు. చంద్రబాబును టార్గెట్ చేసిన కేంద్ర ప్రభుత్వం బాబుని ఇబ్బందులకు గురిచేస్తోందని తెలిపారు .

కేంద్రం చేతిలో ఈసీ కీలుబొమ్మగా మారిందని అందుకే ఏపీలోని అధికారులను బదిలీ చేస్తూ చంద్రబాబుకు ఊపిరాడకుండా చేస్తుందని విహెచ్ ఆరోపించారు.

మరో నాలుగు రోజుల్లో ఎన్నికలున్నాయనగా ఏపీ ప్రధాన కార్యదర్శిని బదిలీ చేయడం అందుకు నిదర్శనం అన్న వీహెచ్ తెలంగాణ రాష్ట్రంలో అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని చెప్పినా , అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పినా వారిపైన ఎటువంటి చర్యలూ ఈసీ తీసుకోలేదని గుర్తు చేశారు.

Babu Is Fighting Alone EC has become a mere toy in centres hands...VH sensation

కేసీఆర్ బహిరంగంగా మోడీని విమర్శించినప్పటికీ, అంతర్గతంగా వారి మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం టీఆర్ఎస్ పార్టీకి కేంద్రం సహకరిస్తుందని ఆయన ఆరోపించారు.

ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కెసిఆర్ డ్రామాలాడుతున్నారని, ఇదంతా కేంద్రం కుట్ర అని పేర్కొన్న విహెచ్ తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి జగన్ కూడా మోడీ జపం చేస్తున్నారని తెలిపారు. న్యాయబద్ధంగా పోరాటం చేస్తున్న వ్యక్తి ఎవరు అన్న విషయాన్ని ఏపీ ప్రజలు గుర్తించాలని విహెచ్ హనుమంతరావు విజ్ఞప్తి చేశారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+