అసెంబ్లీ సమావేశాలపై బీఏసీలో కీలక నిర్ణయాలు..!!
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. గవర్నర్ తమిళసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించారు. ప్రజా పాలన అందిస్తామని చెప్పుకొచ్చారు. ఈ సమావేశాలల అజెండా ఖరారు చేసేందుకు సమావేశమైన బీఏసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 13వ తేదీ వరకు అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయించారు.
బీఏసీ సమావేశంలో ఈ రోజు మినహాయిస్తే మరో నాలుగు రోజులు పని దినాలుగా ఖరారు చేసారు. ఈ నెల 10న ప్రభుత్వం అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ తొలి సారి సభలో ప్రవేశ పెడుతున్నారు. 11న సెలవు ప్రకటించారు.రేపు (శుక్రవారం) గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన చర్చ జరగనుంది. చర్చ తరువాత ముఖ్యమంత్రి రేవంత్ సమాధానమిస్తారు. ఈ నెల 12న సభలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయనుంది. 12న సభలో బడ్జెట్ పైన చర్చ చేపట్టనున్నారు. 12, 13 తేదీల్లో బడ్జెట్ పైన చర్చ ..ప్రభుత్వం నుంచి సమాధానం ఇవ్వాలని నిర్ణయించారు.

బీఏసీ సమావేశంలో బీఆర్ఎస్ నుంచి కేసీఆర్‌కు బదులుగా హరీశ్‌రావు బీఏసీ సమావేశానికి వెళ్లారు. తన బదులుగా హరీశ్‌రావు బీఏసీకి వస్తారని కేసీఆర్ ముందే సమాచారం ఇచ్చారు. బీఏసీకి హరీశ్‌రావు రావడంపై శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఏసీ ప్రారంభమైన కాసేపటికే హరీశ్‌రావు బయటకు వచ్చారు. దీని పైన స్పందించిన హరీష్ ప్రభుత్వం సభలో గవర్నర్ ప్రసంగం పైన అభ్యంతరాలు వ్యక్తం చేసారు. మరో 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రానుందని..ఇప్పటి వరకు ప్రభుత్వం అన్ని గ్యారంటీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో స్పష్టత ఇవ్వటం లేదన్నారు. మహిళలకు రూ 2500 అమలు ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. సభలో సాగునీటి ప్రాజెక్టుల అంశం పై చర్చకు తాము సిద్దమని హరీష్ స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications