వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్తమా రోగులకు బ్యాడ్ న్యూస్ ... ఈ ఏడాది బత్తిన సోదరుల చేప ప్రసాదం లేనట్టే !!

|
Google Oneindia TeluguNews

బత్తిన సోదరుల చేప మందు పంపిణీ కోసం ఒక్క తెలుగు రాష్ట్రాల నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి చాలా మంది ఆస్తమా రోగులు సంవత్సరం అంతా ఎదురు చూస్తారు . దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి ప్రజలు హైదరాబాద్ వేదికగా బత్తిన సోదరులు అందించే చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలకు ఈ ఏడాది కరోనా నిరాశను మిగిల్చింది . ముఖ్యంగా ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధంగా భావించే చేపమందు మృగశిర కార్తె రోజున పంపిణీ చేస్తారు. అయితే ఇప్పుడు చేప ప్రసాదం పంపిణీ ఈ ఏడాది పంపిణీ చెయ్యలేమని బత్తిన సోదరులు చెప్పారు .

హైదరాబాద్ నుంచి తరలివెళ్తూ: వలస కార్మికుల దుర్మరణం: మామిడిపండ్ల లోడుతో వెళ్తోన్న లారీ బోల్తాహైదరాబాద్ నుంచి తరలివెళ్తూ: వలస కార్మికుల దుర్మరణం: మామిడిపండ్ల లోడుతో వెళ్తోన్న లారీ బోల్తా

చేప ప్రసాదం పంపిణీ చెయ్యలేమంటున్న బత్తిని సోదరులు

చేప ప్రసాదం పంపిణీ చెయ్యలేమంటున్న బత్తిని సోదరులు

చేప మందు పంపిణికి ప్రసిద్ధి చెందిన హైదరాబాద్‌ వాసులు బత్తిన సోదరులు ప్రతి సారి ఎన్ని వివాదాలొచ్చినా , చేప ప్రసాదంలో శాస్త్రీయత లేదని కోర్టులకు వెళ్ళినా సరే చేప ప్రసాదం ప్రతి యేడూ పంపిణీ చేస్తూనే వచ్చారు . అయితే ఈ ఏడాది కరోనా ఎఫెక్ట్ తో చేప ప్రసాదం పంపిణీ చెయ్యలేమని చెప్తున్నారు బత్తిన సోదరులు . ప్రతి ఏడాది మృగశిర కార్తె రోజున హైదరాబాద్ లో బత్తిన సోదరులు అందించే చేప మందు కోసం కిలోమీటర్ల మేర బారులు తీరుతారు జనాలు. వివిధ రాష్ట్రాల నుండి హైదరాబాద్ కు వచ్చి అక్కడే బస చేసి మరీ చేప ప్రసాదం కోసం ఎదురు చూస్తారు.

కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగానే నిర్ణయం

కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగానే నిర్ణయం

ఎన్నో సంవత్సరాలుగా బత్తిన సోదరుల చేప ప్రసాదం పంపిణీ , దాని కోసం వచ్చే ఉబ్బసం వ్యాధి గ్రస్తులు, ఇక వారికి సౌకర్యంగా రెండు రోజుల పాటు ఏర్పాట్లు ఆనవాయితీగా వస్తూనే ఉన్నది. అయితే, ఈ ఏడాది ఈ చేప ప్రసాదం పంపిణీపై మొన్నటి వరకు నీలిమేఘాలు కమ్ముకున్నాయి. చేప ప్రసాదం అందిస్తారా లేదా అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. ఇక అనుమానాలకు తగ్గట్టుగానే ఈ ఏడాది చేప ప్రసాదం చేయడం లేదని బత్తిన సోదరులు ప్రకటించారు. ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా సామాజిక దూరం పాటించటం , తగిన జాగ్రత్తలు తీసుకోవటం వంటి చర్యలు చెయ్యాల్సి ఉంది .

హైదరాబాద్ కు రావద్దని వినతి .. ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు నిరాశ

హైదరాబాద్ కు రావద్దని వినతి .. ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు నిరాశ

ఇక ఈ నేపధ్యంలో చేప ప్రసాదం ఉబ్బసం వ్యాధి గ్రస్తుల నోట్లో వెయ్యాల్సి ఉన్న నేపధ్యంలో అది కరోనా కారణంగా సాధ్యం కాదని చేప ప్రసాదం పంపిణి చేయడం లేదని ప్రకటించారు. ఇక తెలంగాణాలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సామాజిక దూరం, పరిశుభ్రత పాటించడం తప్పించి దీనికి మందు లేకపోవడంతో కరోనా వ్యాప్తి నియంత్రణను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణి చేయడం లేదని బత్తిన సోదరులు ప్రకటించారు. ఎవరూ కూడా హైదరాబాద్ రావొద్దని వారు తెలిపారు. దీంతో చాలా మంది ఉబ్బసం వ్యాధి గ్రస్తులు నిరాశ చెందుతున్నారు.

English summary
There is a dilemma about the distribution of fish medicine this year. There are doubts as to whether or not the fish medicine will be served. The battina brothers have announced that they will not be offering fish medicine this year as suspicions have been cast. Due to this year's corona pandemic, they decided not to distribute fish medicine .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X