అయ్యప్ప భక్తులకు బ్యాడ్ న్యూస్.. శబరిమలకు వెళ్ళే ప్రత్యేక రైళ్ళ రద్దు!
అయ్యప్ప స్వామి మాల వేసుకున్న అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళుతున్నారు. ప్రస్తుతం శబరిమల కు వెళుతున్న భక్తులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అలెర్ట్ జారీ చేసింది. శబరిమలకు వెళ్లే 14 ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇక శబరిమల కు వెళ్లే రైళ్ళను రద్దు చేయడానికి అధికారులు వివిధ రకాల కారణాలను చెబుతున్నారు.
14 ప్రత్యేక రైళ్ళను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
మరి ఆ కారణాల విషయానికొస్తే శబరిమల యాత్రికుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని భావించిన నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు అయితే శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో ఎన్ని ప్రత్యేక రైళ్ళు అవసరం లేదని భావించిన దక్షిణ మధ్య రైల్వే 14 ప్రత్యేక రైళ్ళను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది.

శబరిమలకు వెళ్లే రైళ్ళు రద్దు
డిసెంబర్ జనవరి నెలలో పండుగ సీజన్ కూడా కావడంతో రైలు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించిన దక్షిణ మధ్య రైల్వే 120 కి పైగా రైళ్ళను షెడ్యూల్ చేసింది. కానీ ఆశించిన స్థాయిలో డిమాండ్ లేకపోవడంతో శబరిమలకు వెళ్లే 14 రైళ్ళను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
రద్దయిన రైళ్ళ వివరాలు ఇవే
జనవరి 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 1 మధ్యాహ్నం షెడ్యూల్ చేసిన రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రయాణికులు ఈ విషయాన్ని తెలుసుకొని తదనుగుణంగా ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించింది. ఇక రద్దు చేసిన రైళ్ల వివరాల్లోకి వెళితే జనవరి 24వ తేదీన షెడ్యూల్ చేసిన మౌలాలి - కొట్టాయం (07167), జనవరి 25న, జనవరి 31న షెడ్యూల్ చేసిన కొట్టాయం - మౌలాలి (07168) రద్దు చేసింది.
ఈ రూట్లలో రైళ్ళు రద్దు
అలాగే జనవరి 25వ తేదీన, ఫిబ్రవరి 1న మౌలాలి - కొల్లాం (07171), జనవరి 27న కొల్లాం - మౌలాలి (07172) రైలును రద్దు చేసింది. కాచిగూడ కొట్టాయం (07169) రైలును జనవరి 26న, కొట్టాయం కాచిగూడ ( 07170) జనవరి 27వ తేదీన రద్దు చేసింది. నర్సాపూర్ కొల్లాం (07157) జనవరి 27వ తేదీన, కొల్లం నర్సాపూర్ (07158) జనవరి 29న నడవవలసి ఉండగా వాటిని రద్దు చేసింది.
అయ్యప్ప భక్తులకు రైళ్ళ రద్దుతో ఇబ్బంది
సికింద్రాబాద్- కొట్టాయం (07065) జనవరి 28న, జనవరి 29వ తేదీన కొట్టాయం- సికింద్రాబాద్(07066) రైళ్లను రద్దు చేసింది.
జనవరి 24వ తేదీన కాగజ్ నగర్ - కొల్లాం (07161), జనవరి 26న కొల్లాం -కాగజ్ నగర్ రైళ్ళను రద్దు చేసింది. ఇక ఈ రైళ్ల ను రద్దు చేసిన నేపథ్యంలో రిజర్వేషన్ చేసుకున్న వారికి డబ్బులు రిఫండ్ చేస్తారా లేక ఇతర రైళ్లలో అవకాశం కల్పిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా శబరిమలకు వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులకు ఒక్కసారి ఇన్ని రైళ్ళు రద్దు చేయడంతో ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి ఉంది.












Click it and Unblock the Notifications