వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డబ్బెక్కడిది: సుమన్, కోసేస్తాం: రేవంత్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రింటింగ్ ప్రెస్‌లో సాధారణ ఉద్యోగిగా పని చేసిన టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి రూ.కోట్ల ఆస్తులను ఎలా సంపాదించారో ప్రజలకు చెప్పాలని పెద్దపల్లి తెరాస ఎంపీ బాల్క సుమన్ సోమవారం డిమాండ్ చేశారు. ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేసిన రేవంత్ ఇప్పుడు రూ.కోట్ల విలువైన ఇంటిని నిర్మిస్తున్నాడని, దానిని ఎలా నిర్మిస్తున్నాడో చెప్పాలన్నారు.

డబ్బులెక్కడివో తమకు తెలుసునని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఆయన అధికారులను, బడా పారిశ్రామికవేత్తలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, అదే తరహాలో తెలంగాణ ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేద్దామని అనుకుంటున్నాడని, అది సాధ్యం కాదన్నారు.

చానళ్లు చూడనీయకుంటే కేబుళ్లు కోసేస్తాం!: రేవంత్

తన కొడపుకు నడుపుతున్న చానల్‌ కోసమే.. టీవీ-9, ఏబీఎన్‌ ప్రసారాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణలో నిలిపివేశారని రేవంత్‌ రెడ్డి విమర్శించారు.

వెంటనే చానళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలని, లేదంటే గ్రామాల్లో కేబుల్‌ వైర్లు కట్‌ చేసేస్తామని, అలా చేయాలని తమ కార్యకర్తలకు పిలుపునిస్తామని, అప్పుడిక ప్రభుత్వం స్పందించక ఏమి చేస్తుందన్నారు. టీవీ-9, ఏబీఎన్‌ ప్రసారాలపై నిషేధం విధించి 100 రోజులు అయిన సందర్భంగా హైదరాబాద్‌లోజరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌కు ఒక టీవీ చానల్‌, ఒక పత్రిక ఉందని, అవి నెంబర్‌ వన్‌ కావాలంటే, నెంబర్ వన్‌లో ఉన్న వాటిని నిషేధించాలని, అందుకే నిషేధించారని, ఇది వ్యాపార కట్ర అని మండిపడ్డారు.

బాల్క సుమన్

బాల్క సుమన్

ప్రింటింగ్ ప్రెస్‌లో సాధారణ ఉద్యోగిగా పని చేసిన టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి రూ.కోట్ల ఆస్తులను ఎలా సంపాదించారో ప్రజలకు చెప్పాలని పెద్దపల్లి తెరాస ఎంపీ బాల్క సుమన్ సోమవారం డిమాండ్ చేశారు.

బాల్క సుమన్

బాల్క సుమన్

సింగరేణి ఇష్యూపై సింగరేణి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌కు మెమోరాండం ఇస్తున్న పెద్దపల్లి తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ బాల్క సుమన్ దృశ్యం.

బాల్క సుమన్

బాల్క సుమన్

సింగరేణి ఇష్యూపై సింగరేణి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌కు మెమోరాండం ఇస్తున్న పెద్దపల్లి తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ బాల్క సుమన్ దృశ్యం.

రేవంత్

రేవంత్

తన కొడపుకు నడుపుతున్న చానల్‌ కోసమే.. టీవీ-9, ఏబీఎన్‌ ప్రసారాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణలో నిలిపివేశారని రేవంత్‌ రెడ్డి విమర్శించారు.

English summary
Peddapalli MP Balka Suman questions Revanth Reddy about his residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X