హైదరాబాద్‌లో ఉగ్రవాద నిర్మూలన, మోడీ పాక్ పర్యటనపై దత్తాత్రేయ
హైదరాబాద్: ఉగ్రవాద నిర్మూలన విషయంలో భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన వైఖరి ఉందని, తెలంగాణలో ఉగ్రవాద నిర్మూలనకు కేంద్రం సహాయం చేస్తుందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం నాడు అన్నారు. తీవ్రవాదం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు.
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలంటే తీవ్రవాదాన్ని తుదముట్టించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ ప్రయత్నం చేయాలని దత్తాత్రేయ చెప్పారు. ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కాకుండా దేశహితం కోసం పని చేయాలన్నారు.

హైదరాబాదులో ఉగ్రవాద శిక్షణ ఇస్తున్న కేంద్రాలను గుర్తించేందుకు ప్రత్యేక నిఘా విభాగాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి దత్తాత్రేయ సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్ పర్యటనను ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప మిగిలిన పార్టీలు అన్ని స్వాగతించాయని దత్తాత్రేయ అన్నారు.
ప్రధాని మోడీ ఐక్యరాజ్య సమితి కూడా స్వాగతించిందని చెప్పారు. అయితే, కాంగ్రెస్ పార్టీకి మైనార్టీ ఓట్ల భయం పట్టుకోవడం వల్లనే ఈ పర్యటనను తప్పుపడుతున్నారని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ ప్రధానితో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయన్నారు.












Click it and Unblock the Notifications