వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్.. గడీనుండి బయటకు రా; అంబేద్కర్ ను ఇప్పటికైనా స్మరించుకో: బండి సంజయ్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. కెసిఆర్ కు అంబేద్కర్ పట్ల, భారత రాజ్యాంగం పట్ల గౌరవం లేదని బండి సంజయ్ విమర్శించారు. రెండవ దశ ప్రజాసంకల్పయాత్ర నేడు అలంపూర్ జోగులాంబ నుంచి ప్రారంభించనున్న బండి సంజయ్, అంబేద్కర్ జయంతి సందర్భంగా జోగులాంబ జిల్లా లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కేసీఆర్ కు అంబేద్కర్ పట్ల గౌరవం లేదు: బండి సంజయ్

కేసీఆర్ కు అంబేద్కర్ పట్ల గౌరవం లేదు: బండి సంజయ్

ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్ అంబేద్కర్ పట్ల ప్రధాని నరేంద్ర మోడీకి గౌరవం ఉందని, అందుకే అంబేద్కర్ పెట్టిన బిక్ష వల్లే తాను ప్రధాని అయ్యారని మోడీ చెప్పారని పేర్కొన్నారు. అంబేద్కర్ కు భారతరత్న ఇచ్చి గౌరవించిన పార్టీ బీజేపీ అని బండి సంజయ్ కొనియాడారు. అంబేద్కర్ కు మంత్రి పదవి ఇవ్వని, అంబేద్కర్ ను ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ కు అంబేద్కర్ పట్ల ఏ విధమైన గౌరవభావం లేదని పేర్కొన్నారు.

సీఎం గడీ నుండి బయటకు వచ్చి, ఆ మహనీయుని స్మరించుకోవాలి: బండి సంజయ్

కనీసం సీఎం కేసీఆర్ అంబేద్కర్ జయంతి రోజైన సీఎం గడీ నుండి బయటకు వచ్చి, ఆ మహనీయుని స్మరించుకోవాలని బండి సంజయ్ హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానిస్తూ, కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తానని చెప్పి కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ విరుచుకుపడ్డారు. అంబేద్కర్ స్ఫూర్తి గా ఈరోజు నుండి తన రెండో విడత ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభిస్తున్నాం అని బండి సంజయ్ పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలను సాధించడం కోసం బీజేపీ ముందుకు వెళుతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.

కేసీఆర్ భారత ప్రజలను అంబేద్కర్ ను అవమానించారు: డా. లక్ష్మణ్

కేసీఆర్ భారత ప్రజలను అంబేద్కర్ ను అవమానించారు: డా. లక్ష్మణ్

ఇదిలా ఉంటే బి ఆర్ అంబేద్కర్ 131 వ జయంతి సందర్భంగా తెలంగాణ బిజెపి ప్రధాన కార్యాలయంలో బీజేపీ నేతలు అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. అంబేద్కర్ జయంతిలో పాల్గొన్న ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని అనుచిత వ్యాఖ్యలు చేసి భారత ప్రజలను అంబేద్కర్ ను అవమానించారని ఆరోపించారు .

తెలంగాణాలో కల్వకుంట్ల రాజ్యాంగం అములు యత్నం

తెలంగాణాలో కల్వకుంట్ల రాజ్యాంగం అములు యత్నం

కేసీఆర్ కు సామాజిక స్పృహ లేదని విమర్శించిన లక్ష్మణ్ జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుకోవచ్చని పేర్కొన్నారు . ఇక బీసీ రిజర్వేషన్లను కేసీఆర్ తగ్గించారంటూ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఆయన మండిపడ్డారు .

అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై మండిపడిన రఘునందన్ రావు

అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై మండిపడిన రఘునందన్ రావు


బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ అంబేద్కర్ ని ప్రపంచం గుర్తించింది కాని తెలంగాణ ప్రభుత్వం గుర్తించలేదని మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి 8 సంవత్సరాలు అయ్యిందని ఇప్పటివరకు అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు జరగలేదని విమర్శించారు. కేసీఆర్ దళిత ద్రోహి అని పేర్కొన్నారు. దళితుల పట్ల కేసీఆర్ కు చిన్నచూపు ఉందని బిజెపి నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

English summary
Bandi Sanjay was angry with KCR saying that KCR had no respect for Ambedkar and that the CM should come out of his gadi and remember that great man ambedkar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X