బండి సంజయ్ కంట కన్నీరు - చనిపోతే తమపై కాషాయ జెండా కప్పి..!!

ఎప్పుడూ సవాళ్లు..ముఖ్యమంత్రి కేసీఆర్ పైన మాటల తూటాలతో సిద్దంగా ఉండే బండి సంజయ్ కంట కన్నీరు పెట్టారు. వరంగల్ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఒక్క సారిగా ఉద్వేగానికి లోనయ్యారు. బీజేపీ కార్యకర్తలపైన టీఆర్ఎస్ దాడులు చేస్తున్న అంశం పైన ఆయన ప్రసంగిస్తూ ఒక్క సారిగా ఎమోషనల్ అయ్యారు. కార్యకర్తలు కార్యకర్తలు గాయపడం, జైళ్లకు వెళ్లడంపై ఆవేదన చెందుతూ కంటతడి పెట్టారు. గద్గదస్వరంతో కొద్దిసేపు మాట పెగలని స్థితికి సంజయ్ లోనయ్యారు.

Recommended Video

    Bandi Sanjay కంట కన్నీరు - అలా అవుతే తమపై *Politics | Telugu OneIndia
    మరణిస్తే తమపై కాషాయం జెండా

    మరణిస్తే తమపై కాషాయం జెండా

    బీజేపీలో కార్యకర్తలు ఏదో ఆశించి పని చేయటం లేదని..పార్టీ కోసం - ప్రజల సమస్యల కోసం వారంతా పని చేసేందుకు ముందుకు వస్తున్నారని వివరించారు. తాము మరణిస్తే తమ పైన పార్టీ కాషాయ జెండా కప్పి గౌరవిస్తే చాలునని సంతృప్తి పడేవారు ఉన్నారంటూ ఉద్వేగానికి గురయ్యారు. ఆ సమయంలో వేదిక పైన ఉన్న పార్టీ నేతలు సైతం కొంత ఎమోషనల్ గా కనిపించారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ లో భాగంగా పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ముందుగానే ఆయన సభలో మాట్లాడి వెళ్లిపోయారు. ఆ తరువాత సభలో బండి సంజయ్ మాట్లాడారు. బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతోందని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    నాలుగో విడత యాత్రకు సిద్దం

    నాలుగో విడత యాత్రకు సిద్దం

    కేసీఆర్‌ గడీలు బద్దలు కొట్టే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. సెప్టెంబర్ 12నుంచి నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నట్లు బండి సంజయ్ స్పష్టం చేశారు. కేంద్రం తెలంగాణకు ఏం చేసింది.. ఎంత నిధులు ఇచ్చిందనే అంశం పైన తాము ఎప్పుడైనా ..ఎక్కడైనా చర్చకు సిద్దమని బండి సంజయ్ సవాల్ చేసారు. టీఆర్ఎస్ నేతలకు ధైర్యముంటే చర్చకు రావాలని ఛాలెంజ్ చేసారు. హిందు దేవతలను అవమానించే మునావర్ కామెడీ షోకు రెండు వేల మంది పోలీసుల భద్రత నడుమ టీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్‌ కుటుంబంపై దిల్లీ లిక్కర్‌ కుంభకోణం ఆరోపణలు వస్తున్నాయని బండి సంజయ్ తెలిపారు.

    లిక్కర్ కుంభకోణం..అందుకే ఇదంతా

    లిక్కర్ కుంభకోణం..అందుకే ఇదంతా

    కుంభకోణం ఏదైనా కేసీఆర్‌ కుటుంబానికి లింకులు ఉంటాయని ఎద్దేవా చేశారు. లిక్కర్ కుంభకోణం నుంచి కుటుంబాన్ని కాపాడుకోవడానికి కేసీఆర్‌ యత్నిస్తున్నారని ఆరోపించారు. లిక్కర్ కుంభకోణం అంశం పక్క దోవ పట్టించేందుకే మునావర్ ను హైదరాబాద్ కు పిలిపించారని బండి సంజయ్ ఆరోపించారు. ఇక, బండి సంజయ్ మూడో విడత పాదయాత్రలో మొత్తంగా 23 రోజుల పాటు 328 కిలోమీటర్లు సాగింది. దేవరుప్పులలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పరస్పరం కర్రలతో కొట్టుకున్నారు. పాంనూరులో కూడా ఘర్షణ జరిగి లాఠీచార్జి దాకా వెళ్లింది. పాదయాత్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసులు బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి నిరాకరించారు. ఆ తరువాత కోర్టును ఆశ్రయించి..సంజయ్ తన పాదయాత్రకు అనుమతి తీసుకొని.. షెడ్యూల్ ప్రకారం శనివారం ముగించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+