Bandi Sanjay: రంజాన్ కోసం పదో తరగతి పరీక్ష టైం టేబుల్ మారుస్తరా?

Bandi Sanjay: రంజాన్ నేపథ్యంలో ఈ నెల 6 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షలను మధ్యాహ్నం 12.15 గంటల నుంచి 3.15 గంటల వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమంజసం కాదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.

ఆ సమయంలో విద్యార్థులు, ఉపధ్యాయులు, సిబ్బంది మధ్యాహ్న భోజనం చేసే సమయమని.. ఆ సమయంలో పరీక్షలు పెట్టి వారిని ఇబ్బందులకు గురి చేయడం సరికాదని బండి సంజయ్ పేర్కొన్నారు. భోజనం చేసే సమయంలో పరీక్షలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు సాయంత్రం 4 గంటల తర్వాత విధుల నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.

Bandi Sanjay Criticizes Telangana Govt s Decision on 10th Class Pre-Final Exam Schedule During Ramadan

పాఠశాలలు కూడా ఉదయం 9.15 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.15 గంటలకు ముగుస్తాయన్నారు. అయినప్పటికీ మళ్లీ రంజాన్ పేరుతో వేళాపాళా లేకుండా పరీక్షలు నిర్వహించి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. ఒక వర్గం వారిని మెప్పించేందుకు విద్యార్థుల కడుపు మార్చడం న్యాయమా అంటూ ప్రశ్నలు గుప్పించారు. శివరాత్రి సందర్భంగా హిందువులంతా ఉపవాసం, జాగరణ చేస్తారని.. మరుసటి రోజు విశ్రాంతి తీసుకుంటారని.. వారికి కనీసం ఆప్షనల్ హాలీడే కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు తీవ్ర అభ్యంతరకరమని విమర్శించారు.

రంజాన్ కు డ్యూటీ మినహాయింపు, బహుమతులు ఇస్తున్నారని.. మరి అయ్యప్ప, భవానీ, హనుమాన్ భక్తులకు ఇలాంటి మినహాయింపులు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. వెంటనే రాష్ట్ర సర్కారు జారీ చేసిన సర్క్యులర్ ను వెనక్కి తీసుకోవాలని .. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బంది లేకుండా పదో తరగతి ఫ్రీఫైనల్ షెడ్యూల్ మార్చాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+