వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలాంటి సీఎం ఉంటే ఏంటి? లేకుంటే ఏంటి ? కరోనా మరణాలు ప్రభుత్వ హత్యలే : కేసీఆర్ పై బండి సంజయ్ ధ్వజం

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడిలో టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా పట్టింపులేనట్లు టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు.

టీఆర్ఎస్ టికెట్లు రౌడీలు, గూండాలకే , కేసీఆర్ కబ్జాల పార్టీని తరిమి కొట్టండి : బండి సంజయ్ ధ్వజంటీఆర్ఎస్ టికెట్లు రౌడీలు, గూండాలకే , కేసీఆర్ కబ్జాల పార్టీని తరిమి కొట్టండి : బండి సంజయ్ ధ్వజం

కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఎందుకు సమీక్ష నిర్వహించడం లేదని ప్రశ్న

కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఎందుకు సమీక్ష నిర్వహించడం లేదని ప్రశ్న

రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా తాజా పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఎందుకు సమీక్ష నిర్వహించడం లేదని ప్రశ్నించారు బండి సంజయ్. రాష్ట్రంలో కరోనా మరణాలు ప్రభుత్వ హత్యలే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.తెలంగాణ ప్రభుత్వం కరోనా కేసుల విషయంలో తప్పుడు లెక్కలు చెబుతోందని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఇప్పటివరకు సమీక్ష నిర్వహించకపోవడంపై అసహనం వ్యక్తం చేసిన సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు వ్యాక్సినేషన్ ఎందుకు తీసుకోలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

వ్యాక్సిన్ తీసుకోని మంత్రులు ప్రజలకు ఎలా నమ్మకాన్ని కలిగిస్తారు ?

వ్యాక్సిన్ తీసుకోని మంత్రులు ప్రజలకు ఎలా నమ్మకాన్ని కలిగిస్తారు ?

వ్యాక్సిన్ తీసుకోని వారు ప్రజలకు ఎలా నమ్మకాన్ని కలిగిస్తారని, ప్రజలకు వ్యాక్సిన్ తీసుకోవాలని ఎలా చెబుతారని ప్రశ్నించారు బండి సంజయ్. కరోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చడం లేదని ప్రశ్నించిన బండి సంజయ్ ముఖ్యమంత్రి వెంటనే ఆయుష్మాన్ భారత్ ను రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.అంతేకాదు కరోనాను నియంత్రించడం చేతకాక ఆ నెపాన్ని కేంద్రంపై మోపుతున్నారని సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ప్రధాని నరేంద్రమోడీ నిరంతరం కోవిడ్ నియంత్రణకు సమీక్షలు జరుపుతున్నారని రాష్ట్రాల అవసరాలను తీరుస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.

సీఎం కేర్ నిధులపై శ్వేతపత్రం విడుదల చెయ్ !!

సీఎం కేర్ నిధులపై శ్వేతపత్రం విడుదల చెయ్ !!

కరోనా విజృంభణకు ఎన్నికలు ప్రధాన కారణమంటూ పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకులు ఎన్నికల నిబంధనలు పాటించకుండా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు . పీఎం కేర్ నిధుల గురించి పూర్తి నివేదిక ఇచ్చామని పేర్కొన్నఆయన సీఎం కేర్ నిధులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ పరిస్థితులలో ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ ఇస్తున్న సూచనలు సలహాలు తీసుకోవాలని బండి సంజయ్ పేర్కొన్నారు.

కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా కరోనాపై చేసిన వ్యాఖ్యల ఎఫెక్ట్ .. లైట్ తీసుకుంటున్న ప్రజలు

కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా కరోనాపై చేసిన వ్యాఖ్యల ఎఫెక్ట్ .. లైట్ తీసుకుంటున్న ప్రజలు

రాష్ట్రంలో కేసులు, మరణాలకు సంబంధించిన పారదర్శక నివేదిక ఇస్తే కేంద్రం ఆదుకుంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రస్తుత కాలంలో ప్రజలకు భరోసా ఇవ్వని ముఖ్యమంత్రి ఉంటే ఏంటి లేకుంటే ఏంటి అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ కరోనాను చులకనగా మాట్లాడడం వల్లనే ప్రజలు కూడా లైట్ తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కరోనా నిబంధనలను అమలు చెయ్యటంలో కేసీఆర్ సర్కార్ విఫలం అయ్యిందన్నారు.

Recommended Video

Revanth Reddy Poweful Speech | Warangal
 మున్సిపల్ ఎన్నికలపైనా బండి సంజయ్ వ్యాఖ్యలు

మున్సిపల్ ఎన్నికలపైనా బండి సంజయ్ వ్యాఖ్యలు

ఇదే సమయంలో రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలపై మాట్లాడిన ఆయన వరంగల్ ,ఖమ్మం తో పాటు సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేశానని, ప్రజల అభిమానం చూస్తుంటే అత్యధిక స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని అర్థమవుతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. అధికార పార్టీ అవినీతి అక్రమాలతో, ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. అధికార పార్టీ తరఫున అభ్యర్థులుగా రౌడీలు గూండాలు రంగంలోకి దిగారని పేర్కొన్న బండి సంజయ్, క్రిమినల్స్ పట్ల డిజిపి కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.

English summary
Bandi Sanjay was angry with Telangana CM KCR. BJP state president Bandi Sanjay has criticized the TRS government for its complete failure in corona control in Telangana state and questioned why CM KCR was not conducting a review on the latest situation despite the corona epidemic boom. BJP state president Bandi Sanjay said the corona deaths in the state were government killings. He accused the Telangana government of miscalculating corona cases. Sanjay, who expressed impatience with CM KCR for not conducting a review so far, demanded that Chief Minister KCR tell him why the ministers had not taken the vaccination.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X