కేసీఆర్ అంబేద్కర్ రాజకీయం ఇందుకే; కుండ బద్దలు కొట్టిన బండి సంజయ్
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. 125అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం వెనుక ఉన్న కారణాలను వెల్లడించిన ఆయన బిజెపి పోరాటం మరియు ఒత్తిడి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను వేగవంతం చేసి ప్రారంభోత్సవానికి సిద్ధమైందని పేర్కొన్నారు. తాము ఒత్తిడి తీసుకురావడం వల్లే రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు.
ఇప్పటికే చాలాసార్లు నూతన సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ఒక్కరోజు కూడా అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించడానికి వెళ్లలేదని పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి తాము వ్యతిరేకం కాదని పేర్కొన్న బండి సంజయ్, కెసిఆర్ కు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదని మండిపడ్డారు. కెసిఆర్ దళిత ద్రోహి అంటూ నిప్పులు చెరిగారు.

అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు ఏనాడు హాజరుకాని ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్న ఆయన, అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కెసిఆర్ దళిత సమాజానికి క్షమాపణలు చెప్పాలన్నారు. దళిత సమాజాన్ని అడుగడుగునా అవమానించిన వ్యక్తి కేసీఆర్ అని, ప్రత్యేక తెలంగాణ వస్తే దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చి, ఇప్పటివరకు చేయలేదని గుర్తు చేశారు.
దళితుల భూములను లాక్కున్నందుకు కూడా దళిత సమాజానికి క్షమాపణలు చెప్పాలన్నారు. దళితబంధు పథకం నిధుల పైన రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఎన్నికలు వస్తున్న కారణంగానే కెసిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి దళిత ఓటు బ్యాంకు కోసం రాజకీయం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ఏనాడు అంబేద్కర్ ఆశయాలను కెసిఆర్ ప్రభుత్వం సాధించే దిశగా పనిచేయలేదని బండి సంజయ్ పేర్కొన్నారు.

9 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కేసీఆర్ కు అంబేద్కర్ గుర్తొచ్చారా అంటూ ప్రశ్నించిన బండి సంజయ్, కెసిఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా దళిత సమాజం ఆయనను క్షమించదని వెల్లడించారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ ఆశయాలకు, స్ఫూర్తికి అనుగుణంగా పాలన చేస్తామని బండి సంజయ్ తెలిపారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications