కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బండి సంజయ్ బర్త్ డే... కరీంనగర్‌లో ఫ్లెక్సీల వివాదం... అధికారులతో బీజేపీ కార్యకర్తల వాగ్వాదం

|
Google Oneindia TeluguNews

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ కార్యకర్తలు కరీంనగర్‌లో పలుచోట్ల పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఎటువంటి అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్న కారణంతో కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు వాటిని తొలగించారు.

ఇదే క్రమంలో స్థానిక తెలంగాణ చౌక్‌తో పాటు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అధికారులు తొలగిస్తుండగా కార్యకర్తలు అడ్డుపడ్డారు. తొలగించిన ఫ్లెక్సీలను తిరిగి ఏర్పాటు చేశారు. దీంతో అధికారులకు,బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అధికారుల తీరును నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు.

అధికార పార్టీ నేతల ఫ్లెక్సీలను తొలగించని అధికారులు బీజేపీ నాయకుడి ఫ్లెక్సీలను మాత్రం తొలగించడమేంటని వారు ప్రశ్నించారు. తమ విషయంలో రూల్స్ మాట్లాడే అధికారులు అన్ని పార్టీల విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. అధికారులు మాత్రం అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చట్టవిరుద్దమని... వాటిని ఉపేక్షించేది లేదని చెప్పారు. అయితే బీజేపీ కార్యకర్తలు ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో అధికారులే అక్కడినుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.ఆపై బీజేపీ కార్యకర్తలు కూడా నిరసన విరమించి వెళ్లిపోయారు.

 bandi sanjay flexis bjp cadre fires over karimnagar municipal officials

ఈ నెల 7న రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన సందర్భంలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రోడ్ నం.2లో రేవంత్‌ రెడ్డికి శుభాకాంక్షలు చెబుతూ ఆయన అభిమానులు,కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే అనుమతులు లేవన్న కారణంతో జీహెచ్ఎంసీ అధికారులు వాటిని తొలగించారు.

దీంతో రేవంత్ అభిమానులు అధికారులపై ఫైర్ అయ్యారు. అధికార పార్టీ నేతల ఫ్లెక్సీల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరించే అధికారులు ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్ష నేత ఫ్లెక్సీలు తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా అధికారులకు,రేవంత్ అభిమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

ఇక బండి సంజయ్‌ పుట్టినరోజు వేళ పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక ప్రకటనలో ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. బండి సంజయ్ దృఢచిత్తం, పోరాట పటిమ తెలంగాణలో ఆయనను రాజకీయ దృఢసంకల్పం ఉన్న నేతగా నిలిపాయని కొనియాడారు. యువ కార్యకర్తగా రంగప్రవేశం చేసి, అంచెలంచెలుగా ఎదిగిన సంజయ్... తెలంగాణ ప్రజలకు, బీజేపీకి మరిన్ని సేవలు అందిస్తారని విశ్వసిస్తున్నాను.ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఆయన నిండు నూరేళ్లు వర్ధిల్లాలని నా తరఫున, జనసేన తరఫున కోరుకుంటున్నాను.' అని పేర్కొన్నారు.

English summary
On the occasion of Telangana BJP president Bandi Sanjay's birthday, party workers set up large-scale flexis at various places in Karimnagar. However, Karimnagar Municipal Corporation officials removed the flexis on the grounds that they had been set up without any permission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X